Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Volunteer in Oxford Covid vaccine test dies in Brazil: Officials

 


Volunteer in Oxford Covid vaccine test dies in Brazil: Officials

ఆక్స్‌ఫర్డ్ క్లినికల్ ట్రయల్స్‌లో విషాదం.. టీకా వేయించుకున్న వాలంటీర్ మృతి

కరోనా వైరస్ మహమ్మారిని అంతచేసే టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు టీకాలు కీలకమైన మూడో దశకు చేరుకున్నాయి. 

కరోనా వైరస్ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో అపశ్రుతి దొర్లింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వాలంటీర్ మరణించినట్టు బ్రెజిల్ బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆక్స్‌ఫర్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్న వేళ.. ఈ విషాదం చోటుచేసుకోవడం ఆందోళన వ్యక్తమవుతోంది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇటీవల బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో మూడో దశ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, బ్రిటీష్‌ రెగ్యులేటర్స్‌ నుంచి అన్ని అనుమతులూ రావడంతో ప్రయోగాలు పునఃప్రారంభించారు.  

దీంతో భారత్‌, బ్రెజిల్‌ సహా పలు దేశాల్లో పరీక్షలకు ఆయా ప్రభుత్వాలు అనుమతించాయి. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ వ్యక్తి మృతిచెందాడని, ఇందుకు సంబంధించిన ‘ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టు’ తమకు అందిందని బ్రెజిల్‌ ఆరోగ్య విభాగం వెల్లడించింది. సదరు వ్యక్తి టీకా దుష్ప్రభావం వల్ల చనిపోయాడా? లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా? అతడు ఏ ప్రాంతానికి చెందినవాడు అనే వివరాలను అధికారులు వెల్లడించకపోవడం గమనార్హం. కానీ, వ్యాక్సిన్‌ తదుపరి ప్రయోగాలు కొనసాగుతాయని మాత్రం ప్రకటించారు. 

ఇదిలా ఉండగా, వాలంటీరు మృతి వివరాలను సమీక్షించామనీ, తమ టీకా భద్రతపై అనుమానాలు అక్కర్లేదనీ ఆక్స్‌ఫర్డ్‌ ప్రతినిధి అలెగ్జాండర్‌ బక్స్‌టన్‌ వ్యాఖ్యానించారు. గోప్యత అవసరాలు, క్లినికల్ ట్రయల్స్ నియమాల ప్రకారం వ్యక్తిగత కేసులపై వ్యాఖ్యానించలేమని ఆస్ట్రాజెనెకా ప్రతినిధి పేర్కొన్నారు. కానీ ప్రయోగాలు నిలిపివేయడానికి దారితీసే ఆందోళనలు లేవని ఆయన అన్నారు. 

ఆక్స్‌ఫర్డ్ టీకాను కొనుగోలు చేసి, తమ దేశంలో ఉత్పత్తి చేయాలని బ్రెజిల్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ టీకాను రియో-డీ-జెనిరోలోని ఫియోక్రూజ్ రిసెర్చ్ సెంటర్‌లో ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే చైనా వ్యాక్సిన్ సైనోవ్యాక్‌ను సా పౌలో రాష్ట్రంలో ప్రయోగత్మాకంగా పరీక్షించారు. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా మరణాలు సంభవించిన దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అక్కడ మొత్తం 5.2 మిలియన్ల మంది వైరస్ బారినపడగా.. 154,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags