Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Warning to motorists ..Your driving license may cancel with this small mistake!


Warning to motorists ..Your driving license may cancel with this small mistake!
వాహనదారులకు హెచ్చరిక.. ఈ చిన్న తప్పుతో మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్!
కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. చిన్న తప్పు చేసినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయే ప్రమాదముంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.


కొత్త రూల్స్ అమలులోకి
వాహనదారులకు జాగ్రత్త
తప్పు చేస్తే లైసెన్స్ క్యాన్సిల్

కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వెహికల్ రూల్స్‌ను తీసుకువచ్చింది. ఇవి అక్టోబర్ 1 నుంచే అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధనలతో వాహనదారులకు ఊరట కలిగింది. ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవలసిన పని లేదు. వీటిని డిజటల్ రూపంలో చూపించినా సరిపోతుంది.

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. కొత్త రూల్స్ కారణంగా వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. చిన్న తప్పుతో వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సల్ అయిపోయే ప్రమాదముంది. ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ప్రైవేట్, కమర్షియల్ వెహికల్స్ డ్రైవర్స్ బిహేవియర్‌ను మోడ్రన్ టెక్నాలజీతో గమనిస్తున్నారు.

కొత్త రూల్స్ ప్రకారం.. పోలీసులు లేదా ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌తో సక్రమంగా వ్యవహరించకపోతే అది కూడా బ్యాడ్ బిహేవియర్ కిందకు వస్తుంది. అంటే ట్రాఫిక్ పోలీసులు వెహికల్ ఆపుతున్నప్పుడు మీకు ఆపకుండా అలాగే వెళ్లిపోవడం వంటివి చేస్తే కచ్చితంగా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావొచ్చు.

వాహనదారుడి బ్యాడ్ బిహేవియర్ కారణంగా లైసెన్స్ క్యాన్సల్ అయ్యే ప్రమాదముంది. అంతేకాకుండా జరిమానా కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 సెక్షన్ 19, 21 ప్రకారం.. వెహికల్ నడుపుతూ స్మోక్ చేయడం, మందు తాగి వెహికల్ డ్రైవ్ చేయడం, బస్సులో సిగరెట్ తాగడం, వెహికల్‌కు ఎక్కువ లోడ్ వేసుకోవడం వంటివి చేయడం వల్ల డ్రైవర్లు ఎక్కువ మూల్యం చెల్లించుకోవాలి.

అంతేకాకుండా క్యాబ్ డ్రైవర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. రైడ్ ఓకే చేసిన తర్వాత కస్టమర్లు అనుమతి లేకుండా దాన్ని క్యాన్సల్ చేస్తే అప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా రద్దయ్యే ప్రమాదముంది. ఇకపోతే ట్రాఫిక్ పోలీసులు లేదా ఆర్‌టీవో రోజువారీ జరిమానా వివివరాలను కచ్చితంగా ఆన్‌లైన్‌లోకి ఎక్కించాలి. దీంతో డ్రైవర్ల ప్రతి తప్పు ఆన్‌లైన్‌లో రికార్డ్ అవుతూ వస్తుంది.
Previous
Next Post »
0 Komentar

Google Tags