Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

We Are Safe If We Protect Nature - Let's Protect the Environment with These Simple Tips


We Are Safe If We Protect Nature - Let's Protect the Environment with These Simple Tips

ప్రకృతిని కాపాడితేనే మనం సేఫ్.. ఈ సింపుల్ టిప్స్‌తో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పటికైనా మారదాం.. ఈ కింది టిప్స్ పాటించి ప్రకృతితోపాటు మనల్ని మనం కాపాడుకుందాం. 

ప్రకృతిలో మనిషి కూడా ఒక భాగం. అంతే కానీ, ప్రకృతి మనిషి కోసం కాదు. మనిషి శరీరంలాగానే వాతావరణానికి కూడా బ్యాలెన్స్ అవసరం. కానీ, ఆ సంతులనం నిలిపేందుకు మనిషి తనవంతుగా ఎలాంటి కృషి చేయడం లేదు. పైగా.. తెలిసో తెలియకో చేస్తున్న తప్పుల వల్ల ప్రస్తుతం ఉన్న ఆ కాస్త బాలెన్స్‌‌ను కూడా చెడగొడుతున్నారు. క్రమపద్ధతి లేకుండా వనరులని ఇష్టానుసారంగా వాడేయడం, కాలుష్యం, అవసర ఉన్నా లేకపోయినా వస్తువుల్ని కొనడం, వాడి పారేసే అలవాట్ల వల్ల పర్యావరణం మీద ఒత్తిడి పెరుగుతోంది.

ఇప్పటికీ పర్యావరణ రక్షణ కోసం ఏం చేయాలి? ఏం చేయకూడదనే విషయంపై ప్రజలకు అవగాహన లేదు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పర్యావరణం కుదుటపడుతోంది. లాక్‌డౌన్ ఎత్తేసినా, కరోనా పోయినా, తర్వాత పరిస్థితి మళ్లీ దయనీయ స్థితికి చేరుతుంది. వాహనాలు, పరిశ్రమలు ప్రారంభమై పర్యావరణాన్ని నాశనం చేసే ప్రక్రియ మళ్లీ ఆరంభమవుతుంది.

1. మీతో నిత్యం ఒక బ్యాగ్ ఉంచుకోండి:

ఒక ప్లాస్టిక్ క్యారీ బాగ్‌లు భూమిలో కలిసిపోడానికి వెయ్యేళ్ళు పడుతుందనే సంగతి మీకు తెలుసా? వాడి పారేసే ఈ ప్లాస్టిక్ సంచుల వల్ల లక్షలాది అమాయకమైన జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. మార్కెట్‌కు వెళ్ళేటప్పుడు బ్యాగ్ వెంట తీసుకెళ్లడం అలవాటు చేసుకోండి. వీలైతో పర్మినెంట్‌గా ఒక బ్యాగ్ మీ బైక్ లేదా కారులో ఉండేలా చూడండి. ఈ అలవాటు తప్పకుండా పర్యావరణానికి మేలు చేస్తుంది. ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ తయారు చెయ్యడానికి వాడే వనరులన్నింటినీ మనం సేవ్ చేసినట్టే. అలాగే, మూగ జీవుల ప్రాణాలను సైతం కాపాడుగలుగుతాం. ఈ సారి బైటికి వెళ్ళే ముందు తీసుకెళ్ళే వస్తువుల పక్కన మీ బ్యాగ్ పెట్టుకోండి. అప్పుడు మర్చిపోయే ప్రసక్తి ఉండదు. 

2. కొన్ని కూరగాయలైనా పెంచండి:

మొక్కలు వాతావరణంలోకి ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తాయని మనకి తెలుసు. ఇంట్లో స్వయంగా పెంచుకొనే మన కూరల్లో మనం పెస్టిసైడ్స్ (పురుగుల మందు) కూడా వేయం. కాబట్టి.. ఆ కూరగాయలు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు అపార్ట్మెంట్‌లో ఉంటున్నట్లయితే.. అంతా కలిసి కింద తోట పెంచుకోవచ్చు. అది సాధ్యం కాదనుకుంటే చిన్న చిన్న కంటెయినర్లలో కొత్తిమీరా, పుదీనా లాంటి మొక్కలైనా పెంచుకోవచ్చు. మీకు ఉన్న స్పేస్‌ని బట్టి ఇంకేం పెంచచ్చో మీరు ఆలోచించుకోవచ్చు. 

3. కరెంట్ వాడకాన్ని తగ్గించండి:

అందరికీ తెలిసినా మర్చిపోయే విషయాల్లో ఇది ఒకటి. రూం లోంచి బైటికొచ్చేటప్పుడు లైట్స్, ఫాన్, ఏసీ లాంటివి ఆఫ్ చేసి రావడం గుర్తుపెట్టుంకుంటే మనకి తెలీకుండానే చాలా కరెంట్ ఆదా చేస్తాం. నిద్ర లేవగానే ఆలౌట్ స్విచ్ ఆఫ్ చెయ్యడం, వంటింట్లో, బాత్రూంస్ లో ఎగ్జాస్ట్ ఫాన్స్ ఆఫ్ చెయ్యడం, వాషింగ్ మెషీన్ లో ఫుల్ లోడ్ మాత్రమే వెయ్యడం...ఇవన్నీ గమనించుకోవలసిన విషయాలు. 

4. పాడైతే పాడేయకండి.. బాగు చేసుకోండి:

ఇంట్లో ఏదైనా వస్తువు పాడైనప్పుడు.. కొత్త వస్తువు కొనడానికి పరిగెట్టకండి. వీలైతే వాటిని బాగు చేసి వాడుకోడానికి ప్రయత్నించండి. పాడైన వెంటనే వస్తువును బాగు చేయకుండా పాడేయడం సరైన పద్ధతి కాదు. వస్తువుని వాడుతున్నప్పుడే చక్కగా చూసుకోవాలి. పాడైపోకుండా శ్రద్ధగా వాడుకోవాలి. 

5. నేచురల్ ప్రోడక్ట్స్ వాడడం మంచిది:

ఇంట్లో వాడుతున్న చాలా కెమికల్స్‌కు నాచురల్ ఆల్టెర్నేటివ్స్ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుంటే.. కెమికల్స్ వినియోగాన్ని తగ్గించచ్చు. పైగా ఈ ఆల్టెర్నేటివ్స్ చాలా చవకగా కూడా లభిస్తాయి. ఉదాహరణకి బేకింగ్ సోడా, వెనిగర్‌తో ఎన్నో రకాల క్లీనింగ్ పనులు చెయ్యచ్చు. 

6. రీయూజబుల్ బాటిల్స్ వాడండి:

మనం ఎక్కడికెళ్ళినా మనతో పాటూ నీళ్ళు తీసుకుని వెళ్ళాల్సిందే. ప్లాస్టిక్ బాటిల్స్ ఎన్విరాన్మెంట్‌కే కాదు, మనకు కూడా మంచివి కావు. ఇప్పుడు స్టోర్స్‌లో స్టీల్ బాటిల్స్, గాజు బాటిల్స్, మట్టి బాటిల్స్ కూడా లభిస్తున్నాయి. వాటిలో ఏదో ఒకటి తీసుకుంటే మనకు దాహమూ తీరుతుంది, మన వల్ల ఎన్విరాన్మెంట్‌కి నష్టం జరగకుండా ఉంటుంది. 

7. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలు:

వీలున్నంత వరకూ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. లేదా అంటే కార్ పూల్ ఆప్షన్ వాడుకోడం కుదురుతుందేమో ఆలోచించండి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం సొంత వాహనంలో ప్రయాణించడమే ఉత్తమం. కేవలం అత్యవసరమైతేనే వాహనాలను వాడండి. ఇంకా ఎలెక్ట్రిక్ వెహికిల్స్ యూజ్ చెయ్యడం కూడా మంచిదే. అవి ఎలాంటి విష వాయులు వాతావరణంలోకి విడుదల చెయ్యవు. 

8. సైకిల్ వాడండి:

కొద్ది దూరాలకి నడవండి. ఇంకాస్త దూరానికి సైకిల్ మీద వెళ్ళండి. సైకిల్ వాడడం వల్ల మీ పనీ పూర్తవుతుంది, శరీరానికి మంచి వ్యాయామంగా కూడా ఉంటుంది. సైకిల్ వల్ల పర్యావరణ కూడా పొల్యూట్ కాదు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు సైకిల్ వాడడం మంచిదే కదా. పైగా హెవీ ట్రాఫిక్‌లో సైకిల్ మీద వెళ్ళినంత త్వరగా కార్ మీద వెళ్ళలేరని కూడా అంటారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags