Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: EAMCET on Oct 8th - Special Test For Corona Candidates


TS: EAMCET on Oct 8th - Special Test For Corona Candidates
ఈనెల 8న ఎంసెట్‌.. కరోనా అభ్యర్థులకు ప్రత్యేక పరీక్ష
కరోనా బారి‌న‌ప‌డి గత నెల 9 నుంచి 14 ‌వ‌రకు నిర్వహించిన ఎంసె‌ట్‌కు హాజ‌రు‌కా‌లే‌క‌పో‌యిన వారి‌కోసం ఈ నెల 8న ప్రత్యే‌కంగా ఎంసెట్‌ నిర్వహించేందుకు ఏర్పా‌ట్లు‌ చే‌స్తు‌న్నా‌మని కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ గోవ‌ర్ధన్‌ ప్రకటనలో తెలిపారు. కరోనా పాజి‌టివ్‌, నెగె‌టివ్‌ సర్టి‌ఫి‌కె‌ట్లతో‌పాటు హాల్‌టికెట్‌ కూడా కన్వీ‌నర్‌ ఈ– మెయి‌ల్‌కు ఈనెల 5 అర్ధరా‌త్రి‌లోగా పంపాలని సూచించారు.

గత నెలలో జరిగిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలకు కరోనా కారణంగా హాజరుకాలేని వారు ఈ నెల 5వ తేదీలోపు తగిన ఆధారాలను పంపించి దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 14ల మధ్య కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి మళ్లీ పరీక్ష జరుపుతామని పేర్కొన్నారు. ఎంసెట్‌ వెబ్‌సైట్‌లోని అండర్‌టేకింగ్‌ ఫామ్‌ కొవిడ్‌-19 పాజిటివ్‌ క్యాండిడేట్స్‌ అనే పత్రాన్ని పూర్తి చేసి పాజిటివ్‌, నెగెటివ్‌ రిపోర్ట్‌, హాల్‌ టికెట్‌ను ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి లోపు మెయిల్‌కు పంపించాలని ఆయన సూచించారు. అభ్యర్థులు  convenertseamcet2020a@jntuh.ac.in,  convenertseamcet2020b@jntuh.ac.in అనే మెయిళ్లకు పంపించవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags