Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Inter Academic Calendar Released - Term Holidays Cancelled - 127 Working Days

 


AP Inter Academic Calendar Released - Term Holidays Cancelled 

ఏపీ ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల.. టర్మ్‌ సెలవులన్నీ రద్దు..!

ఇంటర్మీడియట్‌ విద్యామండలి 2020-21 అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది. 

AP Inter Board: ఏపీ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు మొత్తం 127 రోజులు పని చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలను వచ్చే సంవత్సరం మార్చి చివరి వారంలో నిర్వహించనున్నారు.

ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది. ఏప్రిల్‌ 24 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్‌ చివరి వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో రెండో శనివారం కూడా తరగతులు నిర్వహిస్తారు. 

ఇక ఈసారి అకడమిక్ ఇయర్‌లో టర్మ్ సెలవులు రద్దు చేస్తున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. మొత్తం 127 రోజులు కాలేజీలు పని చేయనున్నాయి. జూన్‌ 1 నుంచి 2021-2022 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. విద్యార్థులు పూర్తి వివరాలు https://bie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

More details check this link

Previous
Next Post »
0 Komentar

Google Tags