Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Curry Leaves Tea Has Numerous Benefits for Health

 


Curry Leaves Tea Has Numerous Benefits for Health

చలికాలంలో బరువు తగ్గించే టీ.. మరెన్నో సమస్యలు దూరం..

కరివేపాకు టీ.. ఇది బాడీ కి కావాల్సిన న్యూట్రియెంట్స్ ని అందించడంతో పాటూ చలికాలం లో వెచ్చగా తాగడానికి కూడా బావుంటుంది. ఈ టీ లో అల్లం కూడా కలవడం వల్ల ఈ టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువవుతాయి. 

కరివేపాకు మన ఆహారంలో ఒక విడదీయలేని భాగం. సాంబారులో తాలింపు పెట్టాలన్నా, మజ్జిగ లో నాలుగు ఆకులు వేసి చల్లగా తాగాలన్నా కరివేపాకే కావాలి. కరివేపాకుతో ఎన్నో రెసిపీస్ కూడా మనందరికీ తెలుసు. కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి మనకి తెలిసినవే. కరివేపాకుకున్న ఘాటైన పరిమళం వల్ల వంటకానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. కరివేపాకుకి ఉన్న పాప్యులారిటీ దాని ఫ్లేవర్ నుండి మాత్రమే రాలేదు, దానికి ఉన్న అమూల్యమైన హెల్త్ బెనిఫిట్స్ నుండి వచ్చింది. కరివేపాకులో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, కాపర్, ఐరన్, ఫైబర్ మాత్రమే కాక ఇంకా ఎన్నో ఎస్సెషియల్ న్యూట్రియెంట్స్ ఉన్నాయి. 

బెనిఫిట్స్: 

బరువు తగ్గడానికీ, శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించే డీటాక్సిఫికేషన్ అనే ప్రక్రియకూ కరివేపాకు చాలా సాయం చేస్తుంది. అందుకనే, బరువు తగ్గాలని ప్రయత్నించే వారు తప్పని సరిగా కరివేపాకుని వారి ఆహారం లో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అంతే కాక, కరివేపాకు లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన కరివేపాకు ఇమ్యూనిటీ బూస్టర్ లా కూడా పని చేస్తుంది. పోషకాహార నిపుణులు, హెల్త్ ఎక్స్పెర్ట్స్ చెప్పే దాని ప్రకారం కరివేపాకు డయాబెటీస్ మ్యానెజ్ చేయడానికీ, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికీ, ఓవరాల్ గా జీర్ణ కోశాన్ని ఆరోగ్యంగా ఉంచడానికీ హెల్ప్ చేస్తుంది. పొద్దున్నే ఒక గ్లాసు కరివేపాకు జ్యూస్ తాగితే టాక్సిన్స్ ని ఫ్లష్ ఔట్ చేయడమే కాక మెటబాలిజం ని బూస్ట్ చేస్తుందని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. 

అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. అల్లం అరుగుదలకి సహకరిస్తుంది, ఇన్‌ఫ్లమేషన్ తో పోరాడుతుంది. జలుబు తగ్గడానికి సంప్రదాయ సిద్ధమైన మెడిసిన్. వికారాన్ని తగ్గించి ఆకలి కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ తో పోరాడుతుంది. జాయింట్ పెయిన్స్, మెన్స్ట్రువల్ పెయిన్ వంటి వాటికి మంచి మందు. 

ఈ కరివేపాకు టీ ని మీ డైలీ డైట్ లో చేర్చుకుంటే మీ వెయిట్ లాస్ జర్నీ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ టీ ఎలా చేయాలో చూద్దాం రండి. 

బరువు తగ్గడానికి సహకరించే కరివేపాకు టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు: 

1. ఎనిమిది నుండి పది కరివేపాకులు

2. అల్లం ముక్క

3. రెండు మూడు కప్పుల నీరు

4. తేనె, లేదా నిమ్మ రసం (మీకు కావాలంటే) 

తయారు చేసే పద్ధతి: 

1. కరివేపాకులని శుభ్రంగా కడగండి.

2. వీటికి అల్లం ముక్క కలిపి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మరిగించండి.

3. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి.

4. పది నిమిషాల పాటు అలాగే ఉంచండి.

5. టీ వడకట్టండి.

6. మీకు కావాలంటే తేనె లేదా నిమ్మ రసం కలుపుకోండి. 

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Previous
Next Post »
0 Komentar

Google Tags