Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Railways Launches New B. Tech, MBA, M.Sc Programs

 


Indian Railways Launches New B. Tech, MBA, M.Sc Programs

రైల్వే జాబ్స్‌ కోరుకునే వారికి గుడ్‌న్యూస్‌.. కొత్త కోర్సులు ప్రకటించిన రైల్వే

NRTI Courses 2020: భారతీయ రైల్వే కొత్త కోర్సుల్ని ప్రకటించింది. 

ఇండియన్ రైల్వేస్‌లో జాబ్ చేయాలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్‌. భారతీయ రైల్వే కొత్త కోర్సుల్ని ప్రకటించింది. భారతీయ రైల్వేకు నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్ (NRTI) పేరుతో విద్యా సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం విద్యార్థులకు కావాల్సిన శిక్షణ ఇచ్చేందుకు ఈ విద్యా సంస్థ పలు కోర్సుల్ని అందిస్తోంది. వివరాలు https://nrti.edu.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

అయితే.. ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌ఆర్‌టీఐలో కొత్త గా రెండు బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, రెండు ఎంబీఏ కోర్సులు మూడు ఎంఎస్సీ ప్రోగ్రామ్స్‌ని ప్రకటించింది. ఇందులో రెండు బీటెక్ ప్రోగ్రామ్స్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రైల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌కు సంబంధించినవి కాగా.. రెండు ఎంబీఏ ప్రోగ్రామ్స్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సప్లయ్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించినవి. 

ఇక మూడు ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్, సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్, పాలసీ, ఎకనమిక్స్‌కు సంబంధించినవి. ఇందులో సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్ కోర్సును యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హమ్‌తో కలిసి అందిస్తోంది. 

కోర్సులివే:

బీబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్: 3 ఏళ్లు

బీఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ: 3 ఏళ్లు

బీటెక్ ఇన్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్: 4 ఏళ్లు

బీటెక్ ఇన్ రైల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 4 ఏళ్లు

ఎంఎస్సీ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్: 2 ఏళ్లు

ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీ అండ్ పాలసీ: 2 ఏళ్లు

ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్: 2 ఏళ్లు

ఎంబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్: 2 ఏళ్లు

ఎంబీఏ ఇన్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్: 2 ఏళ్లు

Previous
Next Post »

1 comment

  1. what is the qualificatoin sir?? now iam studying inter 2 year ....

    ReplyDelete

Google Tags