Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Stress Relieving Foods to Try If You’re Feeling Anxious

 

Stress Relieving Foods to Try If You’re Feeling Anxious

ఒత్తిడితో బాధపడుతున్నారా? ఈ ఆహారాన్ని తీసుకోండి!

తీవ్రమైన ఒత్తిడి అనారోగ్యానికి దారి తీస్తోంది. కాబట్టి.. మీరు ఈ ఆహారాన్ని తీసుకుని ఒత్తిడిని జయించేందుకు ప్రయత్నించండి.

బిజీ లైఫ్.. ఎన్నో ఒత్తిళ్లకు గురిచేస్తుంది. అయితే, ఒత్తిడికి అదొక్కటే కారణం కాదు. మానసిక, ఆరోగ్య సమస్యలు సైతం ఒత్తిడిలోకి నెట్టేస్తాయి. ఒత్తిడి క్రమేనా కుంగుబాటుకు గురిచేస్తుంది. కాబట్టి.. మీరు తప్పకుండా ఒత్తిడి జయించి, హాయిగా జీవించాలి. ఇందుకు మీరు మానసికంగా సిద్ధం కావడమే కాకుండా.. ఒత్తిడిని ఓడించడానికి సహకరించే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. 

మన పూర్వికులు.. ఎక్కువగా పండ్లు, కాయగూరలు, గింజలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలను ఆహారంగా తీసుకొనేవారు. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలు, త్రుణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన అన్నిరకాల పోషకాలు లభిస్తాయని నమ్మేవారు. వాటిలో ఉండే పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు.. వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించేవి. 

అయితే, నేటి ఆధునిక జీవన శైలిలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగ బాధ్యతలు ఎక్కువై తీవ్రమైన ఒత్తిడికి గురవ్వుతున్నారు. అయితే, దీని నుంచి బయటపడటం మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఒత్తిడికి గురయ్యేవారిలో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉంటున్నారు. కాబట్టి మహిళలు తప్పనిసరిగా సమతుల ఆహారం తీసుకోవాలి. మరి ఏయే ఆహారాలు ఒత్తిడి దూరం చేస్తాయో తెలుసుకుందామా! 

చేపలలో లభించే ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు ఒత్తిడి తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తాయి.

పాలు కూడా ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇందులోని ల్యాక్టోజ్ నిద్రలేమి సమస్యను తగ్గించి, మెదడును చురుగ్గా ఉంచుతుంది.

గోధుమల్లో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సిజన్‌ను సరఫరాను మెరుగుపరిచి ఒత్తిడిని దూరం చేస్తుంది.

బొప్పాయిలోని కెరోటిన్‌ శరీరంలోని విషతుల్యాల్ని బయటకు పంపుతుంది. ఫలితంగా శరీరం, మనసు తేలికపడి ఒత్తిడి తగ్గుతుంది. 

నిమ్మజాతి పండ్లలో కమలా పండ్లకు ఓ ప్రత్యేకత ఉంది. ఇందులోని విటమిన్‌-సి ఒత్తిడిని ప్రభావితం చేసే హార్మోన్లను నియంత్రిస్తుంది. 

చాక్లెట్లు తీసుకున్నా ఒత్తిడి దూరమవుతుంది. ఇందులోని ఫెనిలెథిలమైన్‌ ఎండార్ఫిన్‌ సహజ సిద్ధమైన యాంటీ-డిప్రెషన్‌గా పనిచేస్తుంది.

అరటిపండులోని క్యాలరీలు, మెగ్నీషియం సైతం ఒత్తిడిని సులభంగా తగ్గిస్తాయి.

బంగాళా దుంపల్లో జింక్‌, విటమిన్‌-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి.

ఆప్రికాట్‌లోని కెరోటిన్‌, పెరుగులోని విటమిన్‌-బి సైతం ఒత్తిడిని దూరం చేస్తాయి. 

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే అందించాం.

Previous
Next Post »

1 comment

Google Tags