KNRUHS MBBS BDS Management Quota
Notification Released For 2020-21
టిఎస్: బీబీఎస్, బిడిఎస్ మేనేజ్‌మెంట్ కోటా
సీట్ల భర్తీకి నోటిఫికేషన్
కాళోజీ నారాయణరావ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2020-21 విద్యా సంవత్సరానికి గాను మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
5న వైద్యవిద్య తొలి విడత సీట్ల
కేటాయింపు ఫలితాలు
8న కళాశాలల్లో చేరికకు తుది
గడువు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో - కన్వీనర్ కోటాలో తొలి విడత సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు తెరలేచింది. నీటిలో అర్హత సాధించిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ఇప్పటికే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ నేపథ్యంలో జాబితాలోని వారంతా ప్రాధాన్య క్రమంలో వైద్య కళాశాలను ఎంచుకోవడానికి వర్సిటీ పచ్చజెండా ఊపింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో సీటు పొందడానికి నచ్చిన వైద్య కళాశాలల ఐచ్ఛికాలను ఈనెల 2న ఉదయం ఏడింటి నుంచి 4న సాయంత్రం 7 గంటల వరకూ ఆన్లైన్లో ఇవ్వాలంటూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. వైద్యకళాశాలల వారీగా ఖాళీల వివరాలు వెబ్సైట్లో ఉన్నాయనీ, మరింత సమాచారం కోసం అదికారిక వెబ్సైట్ను చూడాలని కోరింది. 3 రోజుల ఆన్లైన్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనంతరం ఈ నెల 5న తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయనున్నారు. సీటు పొందిన అభ్యర్థులు సంబంధిత కళాశాలలో చేరేందుకు ఈనెల ఎనిమిదో తేదీని తుది గడువుగా నిర్ణయించనున్నట్లు ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి. కన్వీనర్ కోటాలో తొలి విడత ప్రక్రియ పూర్తయ్యాక ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య ప్రవాస భారతీయ కోటాల్లో తొలి విడత ప్రవేశాలు నిర్వహిస్తారు. అఖిల భారత వైద్యవిద్య కోటాలో రెండో విడత ప్రదేశాల్లో సీట్ల కేటాయింపు ఇప్పటికే పూర్తయింది. కేటాయించిన కళాశాలల్లో చేరడానికి ఈ నెల 8ని తుది గడువుగా నిర్ణయించారు. తర్వాత కూడా ఆ కోటాలో సీట్లు మిగిలితే, వాటిని తిరిగి రాష్ట్రాలకు 15 శాతం నిబంధనల మేరకు అందజేస్తారు. ఈ లెక్కన రాష్ట్రానికి 8వ తేదీ అనంతరం అఖిల భారత కోటా నుంచి మిగులు సీట్లు ఏమైనా వస్తే.. వాటినీ కలుపుకొని రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో రెండో విడత ప్రవేశాలను నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్యవర్సిటీ వర్గాలు తెలిపాయి.
అభ్యర్థులు పూర్తి
వివరాలకు http://www.knruhs.telangana.gov.in/ వెబ్‌సైట్
చూడొచ్చు.
NOTIFICATION
FOR EXERCISING WEB-OPTIONS FOR FIRST PHASE OF COUNSELING
MERIT
LIST OF ELIGIBLE CANDIDATES AND LIST OF NOT ELIGIBLE CANDIDATES PWD CATEGORY
MINORITY
MEDICAL COLLEGES SEAT MATRIX
CORRIGENDUM
TO PROVISIONAL FINAL MERIT LIST
NOTIFICATION
FOR ON-LINE APPLICATIONS
LIST
OF ELIGIBLE AND NOT ELIGIBLE CANDIDATES UNDER CAP CATEGORY
0 Komentar