Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MP Schools for Classes 1 To 8 To Remain Shut till March 31 Due to Coronavirus

 

MP Schools for Classes 1 To 8 To Remain Shut till March 31 Due to Coronavirus

మధ్యప్రదేశ్‌: మార్చి 31 వరకు స్కూళ్లు బంద్‌.. బోర్డ్‌ ఎగ్జామ్స్‌ క్యాన్సిల్‌

కరోనా కారణంగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

9-12 తరగతులకు వారంలో ఒకటి లేదా రెండు రోజులు క్లాసులు

2021 ఏప్రిల్‌లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం

సాధారణ టీవీలను కూడా స్మార్ట్‌గా మార్చే సెట్ టాప్ బాక్స్

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరం వరకూ తెరవకూడదని నిర్ణయించింది. పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్‌లు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం 10, 12వ తరగతుల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. 

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలల బంద్‌ను మార్చి 31 వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకటి నుంచి 8వ తరగతులను మార్చి 31 వరకూ ప్రారంభించరాదని నిర్ణయించింది. అలాగే.. ఈ ఏడాది ఐదు, ఎనిమిది తరగతి బోర్డు పరీక్షలను కూడా రద్దు చేసింది. 

తొమ్మిది నుంచి 12 వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ఇక.. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించబోమని.. వారు చేపట్టిన ప్రాజెక్టు వర్కుల ఆధారంగానే మార్కులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారమే 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రానున్న విద్యాసంవత్సరాన్ని 2021 ఏప్రిల్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. 

ప్రయివేట్ పాఠశాలలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని.. తరగతులు నిర్వహించకుండా ఎటువంటి ఫీజులు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన 10వేల పాఠశాలలను ప్రారంభించనున్నట్టు వివరించారు. విద్యార్థులకు యూనిఫామ్‌లు సిద్ధం చేసే బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్టు సీఎం తెలిపారు. క్లాత్‌లను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి అందజేయనున్నట్టు పేర్కొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags