Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIRDPR Recruitment 2020: 510 Young Fellow Coordinator and Other Posts

 

NIRDPR Recruitment 2020: 510 Young Fellow Coordinator and Other Posts

హైద‌రాబాద్‌లో 510 జాబ్స్‌.. నెలకు రూ.55 వేల వరకూ జీతం

ఎన్ఐఆర్‌డీపీఆర్ 510 స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌, యంగ్ ఫెలో, క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ ‌(ఎన్ఐఆర్‌డీపీఆర్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 510 స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌, యంగ్ ఫెలో, క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. దేశ‌వ్యాప్తంగా క్ల‌స్ట‌ర్ మోడ‌ల్ గ్రామ‌పంచాయ‌తీలను అభివృద్ధి చేయడంలో భాగంగా భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఎన్ఐఆర్‌డీపీఆర్ ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 29 తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు http://nirdpr.org.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 510

1) స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్ ‌- 10 పోస్టులు

2) యంగ్ ఫెలో - 250 పోస్టులు

3) క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్ ‌- 250 పోస్టులు 

1) స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌:

విధులు: ఈ పోస్టులకు ఎంపికైన వారు క‌్ల‌స్ట‌ర్‌ మోడ‌ల్ గ్రామ‌పంచాయ‌తీల ఏర్పాటులో భాగంగా ఎంపిక చేసిన గ్రామ‌పంచాయ‌తీల‌లో జ‌రుగుతున్న ప‌నుల‌ను క్షేత్ర స్థాయిలో మానిట‌రింగ్ చేయాల్సి ఉంటుంది.

అర్హ‌త‌: సోష‌ల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ (ఎక‌న‌మిక్స్‌/ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ పొలిటిక‌ల్ సైన్స్‌/ ఆంథ్ర‌పాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌/ హిస్ట‌రీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీస అక‌డ‌మిక్ మెరిట్ (ప‌దోత‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు) కూడా అవ‌స‌రం. ప‌దో త‌ర‌గ‌తిలో 60%, ఇంట‌ర్మీడియ‌ట్‌లో 50%, గ్రాడ్యుయేష‌న్‌లో 50%, పోస్టు గ్రాడ్యుయేష‌న్‌లో 50% మార్కులు ఉండాలి.

వ‌య‌సు: 01.11.2020 నాటికి 30-50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ&ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

జీతభ‌త్యాలు: నెల‌కు రూ.55 వేలు ఉంటుంది. దీనితో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణ‌, ఇత‌ర ఖర్చుల‌ను చెల్లిస్తారు. 

2) యంగ్ ఫెలో:

విధులు: క్షేత్రస్థాయిలో గ్రామ‌పంచాయ‌తీల‌కు వెళ్లి వివిధ శాఖ‌ల‌ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి వారికి గ్రామ‌పంచాయ‌తీ ప‌నుల‌ను వివ‌రిస్తూ.. వారితో క‌లిసి అభివృద్ధి ప‌నుల్లో పాల్గొన‌డం వీరు చేయాల్సిన పని.

అర్హ‌త‌: సోష‌ల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా(ఎక‌న‌మిక్స్‌/ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ పొలిటిక‌ల్ సైన్స్‌/ ఆంథ్ర‌పాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌/ హిస్ట‌రీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీస అక‌డ‌మిక్ మెరిట్ (ప‌దోత‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు) కూడా అవ‌స‌రం. ప‌దో త‌ర‌గ‌తిలో 60%, ఇంట‌ర్మీడియ‌ట్‌లో 50%, గ్రాడ్యుయేష‌న్‌లో 50%, పోస్టు గ్రాడ్యుయేష‌న్‌లో 50% మార్కులు ఉండాలి.

వ‌య‌సు: 01.11.2020 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎస్సీ & ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

జీతభ‌త్యాలు: నెల‌కు రూ.35 వేలు ఉంటుంది. దీనితో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణ‌, ఇత‌ర ఖర్చుల‌ను చెల్లిస్తారు. 

3) క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్‌:

విధులు: వీళ్లు వార్డు స్థాయిలో ప్ర‌జల్ని గ్రామంచాయ‌తీ విధుల్లో (గ్రామ ‌స‌భ‌, వార్డ్ స‌భ‌, మ‌హిళా స‌భ‌)పాల్గొనేలా వారిని చైత‌న్య‌వంతుల్ని చేయ‌డం.

అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తోపాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌లో ప‌ని చేసిన అనుభ‌వం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌గా ప‌ని చేసి ఉండ‌డం/ ఎన్ఐఆర్‌డీపీఆర్‌/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత స‌ర్టిఫికెట్ ప్రోగ్రాములు చేసి ఉండాలి.

వ‌య‌సు: 01.11.2020 నాటికి 25-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎస్సీ & ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

జీతభ‌త్యాలు: నెల‌కు రూ.12,500 ఉంటుంది. దీనితో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణ‌, ఇత‌ర ఖర్చుల‌ను చెల్లిస్తారు. 

ముఖ్య సమాచారం:

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: డిసెంబర్‌ 29, 2020.

ఎంపిక: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/

నోటిఫికేషన్‌:

Previous
Next Post »
0 Komentar

Google Tags