Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Sunday Story Time Programme on Every Sunday Guidelines

 


Sunday Story Time Programme on Every Sunday Guidelines

సండే స్టోరీ టైమ్ మార్గదర్శకాలు


Sunday Storytime - Check-in form

- రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 3 నుండి 9 తరగతుల విద్యార్థులకు పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘we love reading’ అనే పఠన ప్రచారాన్ని పాఠశాల విద్యాశాఖ, AP ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

- విద్యార్థులలో మరియు ఉపాధ్యాయులలో కూడా నిరంతర పఠనం అలవాటుగా చేయాలనేదే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం. 

- పాఠశాల ఆధారిత పఠన కృత్యాలతో పాటు ఖాళీ సమయాన్ని సద్వినియోగ పరచాలనే ఉద్దేశ్యంతో ‘sunday story time’ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించడమైనది. 

- లైబ్రరియన్ లతో , గ్రామ సచివాలయానికి చెందిన విద్య & సంక్షేమ సహాయకులు, పఠన వాలంటీర్ల  సహకారాలతో, ప్రతి ఆదివారం పిల్లలు   పబ్లిక్ లైబ్రరీలలో / కాలనీలలో / వీధుల్లో / వార్డులలో సమావేశమై పఠన కృత్యాలను నిర్వహించవలెను. 

- Sunday story time కి సంబంధించి పై వారితో ప్రధానోపాధ్యాయులు ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. 

- ది.06.12.2020 న పైన పేర్కొనిన వారందరూ పబ్లిక్ లైబ్రరీని మరియు సామూహిక పఠనా కేంద్రాల ప్రాంతాలను గుర్తించి, సందర్శించి...ఉదయం 10 గంటలకు విద్యార్థులను కూడా ఆహ్వానించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సామూహిక పఠనం చేయించాలి. 

- ది.06.12.2020 ఆదివారం పైన పేర్కొనిన వారందరూ కలసి పాఠశాల లైబ్రరీ నుండి CLIL పుస్తకాలు/NBT పుస్తకాలు/CBT పుస్తకాలు ఏదైనా ఒక పుస్తకం ఎంపికచేసి సరిపోవు సంఖ్యలో సేకరించాలి. 

- ది.06.12.2020 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పై వారందరూ కలసి సామూహిక పఠనా కార్యక్రమాన్ని (sunday story time) నిర్వహించాలి. 

- ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు పై వారందరూ కలిసి సామూహిక పఠనా కార్యక్రమం గురించి క్లుప్తంగా వివరించిన పిదప, విద్యార్థులచే సొంతగా పఠనం చేయించాలి. 

- ఈ సామూహిక పఠన కార్యక్రమంలో ఆసక్తి కలిగిన వ్యక్తులు , విద్యావేత్తలు , సీనియర్ సిటిజన్ లు , విద్యార్థుల సేవలను వినియోగించుకోవలెను. వీరిలో ఒకరిని ఆదివారంనకు  పఠన వాలంటీర్ గా వ్యవహరించేలా చూడాలి. 

- ప్రతి ఆదివారం అన్ని లైబ్రరీలలో , అన్ని అవాస ప్రాంతాలలో 3 నుండి 9 తరగతుల విద్యార్థులను ఆహ్వానించి సామూహిక పఠనా కార్యక్రమాన్ని (sunday story time) నిర్వహించాలి. 

- పై వారందరూ కలసి sunday story time కి ముందురోజున సామూహిక పఠనా  కార్యక్రమం యొక్క సంసిద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. 

- అందరు తల్లిదండ్రులను , విద్యార్థులను సామూహిక పఠనా కార్యక్రమానికి హాజరయ్యేలా వాట్సాప్ / ఫోన్ కాల్ / వ్యక్తిగత ఆహ్వానం ల ద్వారా ఆహ్వానించాలి. 

- స్థానికంగా ఆసక్తి గల వాలంటీర్ల సహాయం తీసుకోవచ్చు. 

-సామూహిక పఠనా కార్యక్రమానికి సరిపోవు సంఖ్యలో పుస్తకాలు సిద్ధంగా సేకరించి ఉంచుకోవాలి. 

- ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలి. 

- విద్య & సంక్షేమ సహాయకుల సేవలు వినియోగించుకునేందుకు గ్రామ సచివాలయాల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

Refer RC document also


Guidelines in English👇

 

Previous
Next Post »
0 Komentar

Google Tags