Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Higher Insurance Premium on Cards for Vehicles Violating Traffic Rules

 

Poor Driving Can Increase Your Insurance Premium, IRDAI Suggests Traffic Violation Premium

మీకు టూవీలర్ ఉందా? లేదంటే కారు కలిగి ఉన్నారా? అయితే మీకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ట్రాఫిక్ రూల్స్‌తో వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం లింక్ కాబోతోంది. 

ఐఆర్‌డీఏఐ కొత్త సిఫార్సులు

త్వరలో అమలులోకి 

ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అప్పుడే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కొంత మంది రూల్స్‌ను బ్రేక్ చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ నిబంధనలను మీరుతుంటారు. అయితే ఇలా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారు ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిఉంది. 

ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ కొత్త రూల్స్ తీసుకువస్తోంది. ట్రాఫిక్‌కు ఇన్సూరెన్స్‌కు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఒక లింక్ ఉంది. మీరు ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తే.. మీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది. అంటే మీరు ట్రాఫిక్ చలానాతోపాటు ప్రీమియం కూడా ఎక్కువ కట్టాల్సి రావొచ్చు. 

ఐఆర్‌డీఏఐ ఇప్పటికే తన ప్రతిపాదనలో తుది నివేదికను రెడీ చేసింది. తొలిగి ఈ రూల్స్ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అమలులోకి రావొచ్చు. తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకునే సమయంలో గత రెండేళ్ల నాటి ట్రాఫిక్ చలానాలను పరిగణలోకి తీసుకొని మీకు ప్రీమియం నిర్ణయిస్తారు. 

అందువల్ల మీరు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుసారంగా వెహికల్ నడిపి ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎక్కువ డబ్బులు చెల్లించుకోవలసి వస్తుంది. ట్రాఫిక్ పాయింట్లకు అనుగుణంగా వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది. అదే మీరు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకపోతే ప్రీమియంలో తగ్గింపు కూడా లభిస్తుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags