Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ఫిబ్రవరి 1 నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రారంభం - ఆదేశాలు జారీ చేసిన జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌

 

TS: ఫిబ్రవరి 1 నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రారంభం - ఆదేశాలు జారీ చేసిన జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ 

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి జేఎన్‌టీయూ పరిధిలోని విద్యాసంస్థ‌ల‌ను ప్రారంభించాలని రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ అన్ని అనుబంధ, అటానమస్‌ కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా అకడమిక్‌ షెడ్యూల్‌ విడుదల చేయడంతోపాటు పలు మార్గదర్శకాలిచ్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తామంటూ విద్యారుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకోవాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. హాస్టళ్లలో ఉండేందుకు తల్లిదండ్రుల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకురావాలని సూచించింది. వసతి గృహాల్లో ఉండే విద్యారులు ఆర్టీపీసీఆర్‌(కరోనా) పరీక్ష చేయించుకుని రావాలని పేర్కొంది. 

ఇదీ షెడ్యూల్‌:

ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు 3, 4 సంవత్సరాల బీటెక్, బీఫార్మసీ విద్యార్థులకు ల్యాబ్‌ క్లాసులు, ల్యాబ్‌ ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్‌ పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో 1, 2 సంవత్సరాల విద్యారులకు ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతాయి. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల మూడో సెమిస్టర్‌ విద్యారులకు ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్‌ జరుగుతాయి. మొదటి సెమిస్టర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ఉంటాయి.

ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు 1, 2 సంవత్సరాల విద్యారులను అనుమతించి ల్యాబ్‌ ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. రెండో ఏడాది విద్యార్థుల‌కు మిడ్‌-2 సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. 3, 4 సంవత్సరాల విద్యార్థుల‌కు ఆన్‌లైన్‌ తరగతులు ఉంటాయి.

WEBSITE

NOTICE

Previous
Next Post »

2 comments

  1. Is there any recruitments in HCl please notify me

    ReplyDelete
    Replies
    1. Check 'job notification' folder. Today we have posted about HCL virtual drive in February.

      Delete

Google Tags