ఈ వేసవిలో నీటి శాతం తో పాటు
అవసరమైన పోషకాలు ఉన్న ఈ పండ్లు తినండి
ఎండలు మండి పోతున్నాయి. వాతావరణం
వేడిగా ఉంటోంది. దాహార్తిని తీర్చే పండ్లు, కొబ్బరి నీళ్లు ఎండ
వేడిమినుంచి శరీరాన్ని కాపాడుతాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూస్తుంది.
కుండలోని నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది. మజ్జిగ, రాగి జావ
వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటితో ఎక్కువ నీటి శాతం ఉన్న పండ్లు తీసుకోవడం
చాలా అవసరం. మరి వేసవి కాలంలో తీసుకునే ఆ పండ్లు ఏమిటో ఒకసారి చూద్దాం.
ఈ పండ్లు మీ శరీరాన్ని చల్లగా
ఉంచడంతో పాటు అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు
మరియు ఫైబర్లను అందిస్తాయి. ఈ వేసవిలో మీరు తప్పనిసరిగా తినవలసిన కొన్ని పండ్లు
ఇక్కడ ఉన్నాయి.
1. పుచ్చకాయ
ఈ కాయ లోపల గుజ్జు ఎర్రగా పోషకాలతో
నిండి ఉంటుంది. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. ఇది గుండె జబ్బుల
ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పుచ్చకాయలో ఉన్న సిట్రులైన్
అమైనో ఆమ్లం అర్జినిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
2. స్ట్రాబెర్రీ
విటమిన్ సి, మాంగనీస్,
ఫోలేట్, పొటాషియం, బి
విటమిన్లు, కీలకమైన ఫ్లేవనాయిడ్ల యొక్క గొప్ప మూలం. చెడు
కొలెస్ట్రాల్‌ను నివారించడానికి సహాయపడతాయి. స్ట్రాబెర్రీలలో ఉండే ఫైబర్ యొక్క
అధిక కంటెంట్ సున్నితమైన జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
3. పీచ్
ఈ పండ్లలో అధికంగా బీటా కెరోటిన్, లైకోపీన్,
లుటిన్లతో నిండి ఉటుంది. ఇవన్నీ మన కళ్ళకు, హృదయానికి
చాలా మంచివి. పీచ్‌లో నీటి శాతం 88 శాతం. రిఫ్రెష్ పండులో
శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. పీచ్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది . విటమిన్
సి అధికంగా ఉండటం వల్ల, పీచెస్ చర్మానికి అనుకూలమైన ఆహారాలలో
ఒకటిగా పరిగణించబడుతుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల, పీచెస్
చర్మానికి అనుకూలమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
4. ఆప్రికాట్లు
ఆప్రికాట్లలో వాల్యూమ్‌కు 86
శాతం నీరు ఉంటుంది. తక్కువ కేలరీలు మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆప్రికాట్లు
జీర్ణక్రియను మెరుగుపరచడానికి, చర్మ నిగారింపుకు, దృష్టిని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.
5. కీర దోస
కీర దోసలో 95
శాతం నీరు ఉంటుంది. శరీరాన్ని చల్లబరచడంతో పాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు
పంపిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. ఇందులోని పీచుపదార్థం
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కీరా ముక్కలు చక్రాల్లా కట్ చేసి కళ్ల మీద
పెట్టుకుంటే అలసట తగ్గడంతో పాటు కంటి కింద ఉన్న నల్లటి చారలు తగ్గుముఖం పడతాయి.
ప్రతి రోజూ కీరాను ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.
6. కర్బూజ
ఈ పండ్లలో దాదాపు 90
శాతం నీరు ఉంటుంది. విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఈ
విటమిన్లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. కంటి చూపు సమస్యను తగ్గిస్తాయి. విటమిన్
కే, ఈలు శరీరంలో రక్తప్రసరణ సరిగే జరిగేలా చూస్తాయి.
ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె జబ్బులు
రాకుండా కాపాడుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar