వ్యవసాయ, పశువైద్య
మరియు ఉద్యాన డిప్లొమా కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు స్పాట్
కౌన్సిలింగ్
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న
పశుసంవర్ధక, వ్యవసాయ, మత్స్య, డెయిరీ ప్రాసెసింగ్, ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో
ప్రవేశాలకు ఏప్రిల్ 16, 17 తేదీలలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు
పశువైద్య వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ మాధవరావు ప్రకటనలో తెలిపారు. తిరుపతిలోని
శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, గుంటూరులోని ఆచార్య
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెంలోని
ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని పాలిటెక్నిక్ లో సీట్ల భర్తీ కోసం 2020-21
విద్యా సంవత్సరానికి ఆర్జీయూకేటీ సెట్ రాసి గత కౌన్సెలింగ్ లో
దరఖాస్తు చేసుకున్న అభ్యరులు కూడా స్పాట్ కౌన్సెలింగ్ కు హాజరుకావచ్చని తెలిపారు.
0 Komentar