Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ ఇక లేరు

 

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ ఇక లేరు 

తమిళ ప్రముఖ హాస్యనటుడు వివేక్(59) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందారు. నిన్న ఉదయం 11 గంటలకు వివేక్‌ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వివేక్‌ దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు. దర్శక శిఖరం కె. బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ ఒకరు. ‘మనదిల్‌ ఉరుది వేండం’ సినిమా ద్వారా ఈయన సినీ అరంగేట్రం చేశారు. దాదాపు పెద్ద హీరోలందరితో కలిసి నటించారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్, విజయ్‌, అజిత్‌తో కలిసి నటించిన వివేక్‌ హాస్యం పంచారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags