Covishield Priced at Rs 400 Per Dose for
States; Rs 600/Dose for Private Hospitals
కొవిషీల్డ్:
రేటు ఫిక్స్ చేసిన సీరం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసు రూ.400
- ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600
వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు 50శాతం డోసులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునేందుకు వీలు కల్పించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ప్రైవేటు మార్కెట్లో కొవిషీల్డ్ టీకాల ధరలను బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున టీకాను విక్రయిస్తామని వెల్లడించింది.
‘‘కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా ఉత్పత్తిలో 50శాతం కేంద్రానికి, 50శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు అందజేయనున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున విక్రయిస్తాం. విదేశీ టీకాలతో పోలిస్తే మా వ్యాక్సిన్ ధరలు అందుబాటులోనే ఉన్నాయి’’ అని సీరమ్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే రెండు నెలల్లో టీకా ఉత్పత్తిని మరింత పెంచి కొరతను అధిగమిస్తామని సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. 4, 5 నెలల తర్వాత రిటైల్ మార్కెట్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం
కేంద్రప్రభుత్వం ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్లను విక్రయించి రాష్ట్రాలకు పంపిణీ
చేస్తోంది. అయితే ఈ విధానం వల్ల రాష్ట్రాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ విమర్శలు
వస్తున్న నేపథ్యంలో ఇటీవల మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం
తీసుకున్న విషయం తెలిసిందే. టీకా
తయారీదారులు, 50% ఉత్పత్తిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు
సరఫరా చేయడానికి, నిర్ణీత ధరలకు బహిరంగ మార్కెట్లో
విక్రయించుకోవడానికి కేంద్రం అంగీకరించింది. అదనపు డోసులు కావాలనుకుంటే రాష్ట్ర
ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి సేకరించుకునే స్వేచ్ఛ
కల్పించింది.
0 Komentar