Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CoWIN Registration Mandatory For 18-45 Age Group to Get Covid-19 Vaccine

 

CoWIN Registration Mandatory For 18-45 Age Group to Get Covid-19 Vaccine

కొవిన్‌లో పేరు నమోదు తప్పనిసరి - ఏప్రిల్‌ 28 నుంచి నమోదు కార్యక్రమం 

టీకా కేంద్రాల వద్దకు వెళ్లి అక్కడికక్కడే పేర్లు నమోదు చేసుకుంటామంటే కుదరదు.

ఆరోగ్య సేతు యాప్‌లోనూ పేర్లు రిజిస్టర్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.

కరోనా టీకా పొందాలనుకునే 18-44 ఏళ్ల వారు ‘కొవిన్‌’ వెబ్‌ పోర్టల్‌లో ముందుగా తమ పేర్లను నమోదు చేసుకొని తప్పనిసరిగా అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. వీరందరికీ మే ఒకటో తేదీ నుంచి టీకాలు వేయనుండడంతో ఇలా ముందస్తు నమోదు తప్పనిసరి చేశారు. టీకా కేంద్రాల వద్దకు వెళ్లి అక్కడికక్కడే పేర్లు నమోదు చేసుకుంటామంటే కుదరదు. ఎలాంటి గందరగోళం లేకుండా ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించడానికే ఈ ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ 28 నుంచి పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సేతు యాప్‌లోనూ పేర్లు రిజిస్టర్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. 45 ఏళ్లు, ఆ పైబడ్డ వయసు ఉన్నవారు టీకా కేంద్రాల వద్దే పేర్లను నమోదు చేసుకుంటే సరిపోతుందని ఆదివారం అధికార వర్గాలు తెలిపాయి. 

ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఇస్తారా?

అన్ని వయస్సుల వారికీ ఉచిత టీకాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం 18-45 ఏళ్ల వారికి ప్రైవేటు కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సిన్లు లభిస్తాయని పేర్కొంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 18-45 ఏళ్లలోపు వారికి ప్రైవేటు వ్యాక్సిన్‌ సెంటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాల్లోనూ వ్యాక్సిన్‌ లభిస్తుందని పేర్కొంది. ఏప్రిల్‌ 28 నుంచి కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్యసేతు యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, మే 1 నుంచి వారికి అపాయింట్‌మెంట్లు లభిస్తాయని అందులో పేర్కొంది. 

టీకాలు ఎంచుకునే సౌలభ్యం

టీకాల ధరలను కొవిన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామని కేంద్రం తెలిపింది. ప్రైవేటు వ్యాక్సినేషన్‌ సెంటర్లలో రిజిస్ట్రేషన్‌ చేయించుకునేటప్పుడు టీకాను ఎంచుకునే సౌలభ్యం ఉంటుందని తెలిపింది. ఈ ప్రైవేటు సెంటర్లన్నీ.. కరోనా టీకా రకం, వాటి నిల్వలు, కేంద్రం నిర్ణయించిన ప్రకారం వాటి ధరను కొవిన్‌ పోర్టల్‌లో తప్పనిసరిగా చూపించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికే ప్రైవేటు కేంద్రాల్లో టీకా లభిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఆయా రాష్ట్రాల్లో అనుమతించిన ప్రకారం 45 ఏళ్ల లోపు పౌరులు ప్రభుత్వ కేంద్రాల్లో కూడా టీకా పొందేందుకు అర్హులేనని తెలిపారు.

Helpful Links For Vaccine Registration 👇

Link 1

Previous
Next Post »
0 Komentar

Google Tags