Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Oscar Winners 2021: Full List of the 93rd Academy Awards Winners and Nominees

 

Oscar Winners 2021: Full List of the 93rd Academy Awards Winners and Nominees

ఆస్కార్ విజేతలు 2021: 93 వ అకాడమీ అవార్డుల విజేతలు మరియు నామినీల పూర్తి జాబితా

నో మ్యాడ్‌ ల్యాండ్‌ సినిమాకు మూడు ఆస్కార్‌లు

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొనే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా వైరస్‌ కారణంగా గతేడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ వేడుక ఎట్టకేలకు నేడు కన్నుల పండువగా జరుగుతోంది. కొవిడ్‌ కారణంగా మొట్టమొదటిసారి ఈ వేడుకను రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు 93వ అకాడమీ అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంతోమంది దర్శకులు, నటీనటులు పోటీ పడుతున్నారు.

ఇక అవార్డుల విషయానికి వస్తే.. నో మ్యాడ్‌ ల్యాండ్‌ సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించగా, ఇదే సినిమాకుగానూ చోలే జావోకు ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్‌ వరించింది. అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ది ఫాదర్‌ చిత్రానికి అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో ఎమరాల్డ్‌ ఫెన్నెల్‌కు ఆస్కార్‌ దక్కింది.  బెస్ట్‌ రైటర్స్‌గా ‌ క్రిస్ట్‌ఫర్‌ హ్యాంప్టన్‌, ఫ్లోరియన్‌ జెల్లర్‌లకు, ఉత్తమ సహాయ నటుడిగా డానియల్ కలూయకు ఆస్కార్‌ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ సహాయ నటిగా యువాన్‌ యు జంగ్‌ (మీనారి సినిమా)కు అవార్డును ప్రకటించడంతో దక్షిణ కొరియాలోనే ఆస్కార్‌ అందుకున్న తొలి నటిగా ఆమె రికార్డులకెక్కారు.

Oscars 2021: విజేతలు వీరే

ఉత్తమ చిత్రం: నో మ్యాడ్‌ ల్యాండ్‌

ఉత్తమ నటుడు: ఆంథోని హోప్‌కిన్స్‌ (ద ఫాదర్‌)

ఉత్తమ నటి: ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్‌మ్యాండ్‌ (నో మ్యాడ్‌ ల్యాండ్‌)

ఉత్తమ చిత్రం ఎడిటింగ్‌: సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌

ఉత్తమ దర్శకురాలు: చోలే జావో‌ (నోమ్యాడ్‌ ల్యాండ్‌)

ఉత్తమ సహాయ నటుడు: డానియెల్‌ కలువోయా (జుడాస్‌ అండ్‌ ది బ్లాక్ మెస్సయా)

ఉత్తమ సహాయ నటి: యువాన్‌ యు–జంగ్(మీనారి)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ అండ్‌ సినిమాటోగ్రఫి: మ్యాంక్‌

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: టెనెట్‌

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఇఫ్‌ ఎనీథింగ్‌ హ్యాపెన్స్‌ ఐ లవ్‌ యూ

ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: అనదర్‌ రౌండ్‌

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: మై ఆక్టోపస్‌ టీచర్‌

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: ది ఫాదర్‌

ఉత్తమ సినిమాటోగ్రఫీ: మ్యాంక్‌

ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌

ఉత్తమ క్యాస్టూమ్‌ డిజైన్‌: మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: సోల్‌

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌: కొలెట్‌

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: మ్యాంక్‌

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌: సోల్

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: ఫైట్‌ ఫర్‌ యూ (జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మెస్సయ్య)

Oscar Winners List - 2021

Previous
Next Post »
0 Komentar

Google Tags