Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment-2021: Apply for 5454 Junior Associates Posts (Customer Support & Sales)

 

SBI Recruitment-2021: Apply for 5454 Junior Associates Posts (Customer Support & Sales) 

ఎస్‌బీఐ: 5454 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

మే 17  20 దరఖాస్తులకు చివరి తేది



బ్యాంక్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 5454 జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ విభాగంలో 275 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 27 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

అభ్యర్థులు ఏదైనా ఒక స్టేట్‌ నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.sbi.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం పోస్టులు: 5454

విద్యార్హతలు: అభ్యర్థులు గుర్తింపు యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు ఏప్రిల్‌ 1, 2021 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్ష ఉంటుంది. అలాగే స్థానిక భాషకు సంబంధించిన పరీక్ష కూడా ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటాయి. మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. గంట సమయంలో జరిగే ఈ పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. అవి: 1. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (30 మార్కలు) 2. న్యూమరికల్‌ ఎబిలిటీ (35 మార్కులు) 3. రీజనింగ్‌ ఎబిలిటీ (35 మార్కులు). ఒక్కో సెక్షన్‌కు 20 నిమిషాల సమయం కేటాయించారు. 

ముఖ్య తేదీలు:

నోటిఫికేషన్‌ విడుదల: ఏప్రిల్‌ 26, 2021

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 27, 2021

దరఖాస్తుకు చివరి తేది: మే 17 20, 2021

ప్రిలిమినరీ పరీక్ష: జూన్‌, 2021

మెయిన్స్‌ పరీక్ష: జులై 31, 2021     

WEBSITE 1 OR WEBSITE 2

NOTIFICATION

APPLY HERE

Previous
Next Post »

2 comments

  1. This is very sad what ever government treating the people example I saw a sbi junior posts I am intrested to apply post but there is payment for only oc obc and others and no fees for school and st am I asking do you see over and obc candidates have special treating for us we are aliens are what why only for oc and obc candidates kept to pay think with your mind not a cast I really want to share when treating everyone one should be equal then India will be a developed country otherwise it only developing only good bye jai hind

    ReplyDelete
    Replies
    1. Don't treat cast wise treat as people every one

      Delete

Google Tags