Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TGCET-2021 TS Gurukulam Admission 2021-22 Application Deadline Extended

 

TGCET-2021 TS Gurukulam Admission 2021-22 Application Deadline Extended 

రాష్ట్రంలోని గురుకులాల్లో 2021-22 ఏడాదికి ఐదో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశపరీక్ష టీజీ సెట్-2021 దరఖాస్తు గడువు ఏప్రిల్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని - పేర్కొన్నారు. వివరాలకు సంబంధిత సంక్షేమ శాఖల సొసైటీల వెబ్ సైట్లో సంప్రదించాలని సూచించారు. 

రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి సీట్లను భర్తీ చేసేందుకు టీజీ సెట్ - 2021 దరఖాస్తుల ప్రక్రియ మార్చి 10న ప్రారంభం అయ్యింది.. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మొదట ప్రకటించినా ఆ తేదీని ఏప్రిల్ 15 వరకు పొడిగించారు. టీజీ సెట్ కన్వీనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మార్చి 9న నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2020-21)లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్ష మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. ప్రవేశాలకు సంబంధించి సందేహాల నివృత్తికి, సమస్యల పరిష్కారానికి 180042545678 అనే టోల్ ఫ్రీ నంబరును కూడా ప్రారంభించారు.

WEBSITE

APPLICATION

PAYMENT

MODEL QUESTION PAPER

Previous
Next Post »
0 Komentar

Google Tags