Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS-ICET-2021: Counselling Schedule and Details

 

TS-ICET-2021: Counselling Schedule and Details

తెలంగాణ ఐ సెట్ -2021 - కౌన్సెల్లింగ్ వివరాలు 


UPDATE 30-10-2021

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నవంబరు 3వ తేదీ నుంచి ఐసెట్-2021 కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అక్టోబరు 27న సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ఇతర సభ్యులతో సమావేశమై కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారు చేశారు. తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 3 నుంచి 18 వరకు, తుదిదశ 21 నుంచి 28 వరకు కొనసాగుతుందని వివరించారు. ఆయా కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన విద్యార్థులు నవంబరు 27, 28, 29 తేదీల్లోగా సంబంధిత కళాశాలల్లో చేరాలని స్పష్టం చేశారు. స్పాట్ అడ్మిషన్ల విధివిధానాలు నవంబరు 28న ప్రకటిస్తామని వెల్లడించారు.

తొలిదశ కౌన్సెలింగ్ షెడ్యూలు:

నవంబరు 3-9: ఆన్లైన్లో వివరాల నమోదు, స్లాట్ బుకింగ్

నవంబరు 6-10: ధ్రువీకరణ పత్రాల పరిశీలన

నవంబరు 6-11: వెబ్ ఆప్షన్ల నమోదు

నవంబరు 11: వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్

నవంబరు 14: సీట్ల కేటాయింపు

నవంబరు 14-18: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్

తుదిదశ షెడ్యూలు

వంబరు 21: తొలిదశలో నమోదు చేసుకోలేని వారికి రిజిస్టేషన్లు

నవంబరు 22: ధ్రువీకరణ పత్రాల పరిశీలన

నవంబరు 22-28: వెబ్ ఆప్షన్ల నమోదు

నవంబరు 29: వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్

నవంబరు 28: సీట్ల కేటాయింపు

నవంబరు 26-28: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ 

TS ICET-2021 DETAILED COUNSELLING NOTIFICATION

TS ICET-2020 LAST RANKS FIRST PHASE

TS ICET COUNSELLING WEBSITE

===========================

UPDATE ON 23-09-2021:

రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌ ఫలితాల్లో 90.09 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు లింబాద్రి వెల్లడించారు.

ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన లోకేశ్‌కు మొదటి ర్యాంకు రాగా.. సాయి తనూజ రెండో ర్యాంకు సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులు 9 మంది ఉండగా.. కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్థి ఆనంద్‌పాల్‌ ఐదో ర్యాంకు సాధించారు.

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

WEBSITE

==================

NOTIFICTION DETAILS:

రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్‌ను కంట్రోలర్‌ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి జూన్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ. 250 అపరాధ రుసుముతో జూన్‌ 30 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆగస్టు 19, 20 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబరు 17న ఫలితాలు విడుదల చేయనున్నట్లు మహేందర్‌రెడ్డి తెలిపారు.ఆగస్టు 13 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 రీజినల్‌ సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్‌ నిర్వహణ కోసం ఇప్పటికే 60 కేంద్రాలను గుర్తించినట్లు మహేందర్‌రెడ్డి వెల్లడించారు.

దరఖాస్తు మొదలు తేదీ: 07-04-2021

దరఖాస్తులకు చివరి తేది: 15-06-2021

దరఖాస్తులకు చివరి తేది (ఆలస్య రుసుము తో): 11-08-2021

తొలుత ఈ నెల 13 నుంచే హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించినప్పటికీ, సాంకేతిక కారణాలతో ఆదివారం నుంచి వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఆగస్టు 19న ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్‌లలో, 20న ఉదయం10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఓ సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 

పరీక్షల తేదీలు: 19, 20-08-2021

WEBSITE



WEBSITE

APPLY

NOTIFICATION

IMPORTANT DATES - SCHEDULE

Previous
Next Post »
0 Komentar

Google Tags