Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Board Exams: Education Minister to Interact with Students Today

 

CBSE Board Exams: Education Minister to Interact with Students Today

సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షలు: ఈ రోజు విద్యార్థులతో విద్యా మంత్రి రమేశ్ పోఖియాల్ సోషల్ మీడియా ద్వారా ముఖాముఖి 

★ కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్ పోఖియాల్ నిశాంక్ శుక్రవారం విద్యార్థులతో సోషల్ మీడియా ద్వారా ముఖాముఖి సమావేశం కానున్నారు. పది, 12వ తరగతులకు సంబంధించి విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతారు.

★ కరోనా మహమ్మారి కారణంగా చాలా రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడంతో విద్యార్థుల్లో చాలా అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిని నివృత్తి చేయడానికి కేంద్రమంత్రి విద్యార్థులతో ముఖాముఖికి అంగీకరించారు.

★ అనేక ప్రశ్నలు, సందేహాలతో విద్యార్థులు తనకు మెసేజ్ లు పెడుతున్నారని నిశాంక్ తెలిపారు.

★' ప్రియమైన విద్యార్థులారా ! మీ నుంచి నాకు చాలా మెసేజ్ లు, సమాచారం అందింది. నా ఆర్యోగం గురించి కూడా ఆందోళనలు వ్యక్తంచేశారు.

★ ఇందుకుగాను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నాను ' అని నిశాంక్ చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags