Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Debit Card EMI - Check Loan Eligibility on Debit Card of Different Banks

 

Debit Card EMI - Check Loan Eligibility on Debit Card of Different Banks

డెబిట్ కార్డ్ EMI: మీ డెబిట్ కార్డుపై EMI అర్హత ఉందా లేదా, ఉంటే ఎంత ఉందో తెలుసుకోండి

మనకు నచ్చిన వస్తువులను క్రెడిట్‌ కార్డుతో  తీసుకొని సులభ వాయిదాల చొప్పున కొన్ని నెలల్లో క్రెడిట్‌ కార్డు బిల్లును పూర్తిగా చెల్లిస్తాం. ఇది కేవలం క్రెడిట్‌ కార్డుతోనే అప్పు తీసుకోవడం సాధ్యమవుతోంది అనుకుంటే మీరు పొరపడినట్లే..!

డెబిట్‌ కార్డునుపయోగించి కూడా మీకు నచ్చిన వస్తువులను తీసుకోని సులభ వాయిదాల చోప్పున మొత్తాన్ని చెల్లించవచ్చును. ముందుగా మీరు వాడే డెబిట్‌ కార్డుపై ఈఎంఐ వచ్చే  సౌకర్యం ఉందో లేదో సింపుల్‌గా తెలుసుకోండి. 

డెబిట్ కార్డ్ ఈఎంఐపై ముందుగా తెలుసుకోవలసిన విషయాలు: 

* ముందుగా మీ డెబిట్‌కార్డ్‌పై ఈఎంఐ తీసుకొనే అర్హత డెబిట్‌ కార్డ్ నంబర్, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై ఆధారపడి ఉంటుంది . చెల్లింపులు చేసేటప్పుడు వినియోగదారులు కచ్చితంగా బ్యాంకులో రిజిస్టర్‌ ఐనా ఫోన్‌ నంబర్‌ను వాడాలి.

* ఏదైనా వస్తువును ఆర్డర్ చేయడానికి వినియోగదారులు వారి ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ కలిగి ఉండవలసిన అవసరం లేదు. కానీ ఈఎంఐను చెల్లించే సమయంలో కచ్చితంగా తగినంత నిధులను మెయిన్‌టెన్‌ చేయాలి.

* డెబిట్ కార్డులపై ఈఎంఐ పొందే మొత్తాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి. గరిష్ట  లావాదేవీ విలువ ఖాతాదారునికి ముందుగానే ఆమోదించిన పరిమితి ద్వారా నిర్ణయించబడుతుంది. మీరు బ్యాంక్ కస్టమర్ సర్వీస్ లైన్‌కు ఫోన్ చేయవచ్చు లేదా మీ EMI అర్హతను తనిఖీ చేయడానికి SMS పంపవచ్చు. ఆయా బ్యాంకుల ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకొవచ్చును.

* ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులు  డెబిట్‌ కార్డుపై ఈఎంఐ పొందే సౌకర్యాన్ని తెలుసుకోవడానికి వినియోగదారుల ఖాతాకు రిజిస్టర్‌ ఐనా మొబైల్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ను పంపాలి. ఎస్‌ఎంఎంస్‌ పంపిన కొద్ది సేపటికే బ్యాంకు నుంచి అర‍్హత ఉందో లేదో అనే మెసేజ్‌ను పంపిస్తుంది.

బ్యాంక్ ఎస్‌ఎం‌ఎస్ వివరాలు: 

1. Axis Bank: రిజిస్టర్‌ ఐనా మొబైల్‌ నుంచి DCEMI అని టైప్‌ చేసి 56161600 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి.

2. SBI: రిజిస్టర్‌ ఐనా మొబైల్‌ నుంచి DCEMI అని టైప్‌ చేసి 567676 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి.

3. Bank of Baroda: రిజిస్టర్‌ ఐనా మొబైల్‌ నుంచి DCEMI అని టైప్‌ చేసి 8422009988 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి.

4. HDFC Bank: రిజిస్టర్‌ ఐనా మొబైల్‌ నుంచి MYHDFC అని టైప్‌ చేసి 5676712 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి.

5. ICICI Bank: రిజిస్టర్‌ ఐనా మొబైల్‌ నుంచి DCEMI అని టైప్‌ చేసి 5676766 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి.

6. Federal Bank: రిజిస్టర్‌ ఐనా మొబైల్‌ నుంచి DCEMI అని టైప్‌ చేసి 5676762 ఎస్‌ఎంఎస్‌ చేయాలి. లేదా 7812900900 నంబర్‌కు మిస్‌ కాల్‌ ఇవ్వచ్చును.

7. Kotak Mahindra Bank: రిజిస్టర్‌ ఐనా మొబైల్‌ నుంచి DCEMI అని టైప్‌ చేసి 5676788 కు ఎస్ఎంఎస్ చేయాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags