Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: నేటి నుంచి ఉపాధ్యాయులకు టీకాలు – ప్రభుత్వ, ప్రైవేట్ బోధనేతర సిబ్బందికి కూడా టీకాలు

 

TS: నేటి నుంచి ఉపాధ్యాయులకు టీకాలు – ప్రభుత్వ, ప్రైవేట్ బోధనేతర సిబ్బందికి కూడా టీకాలు

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి గురువారం (24వ తేదీ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కరోనా టీకా వేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించడంతో పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన బుధవారం డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేయనున్నారు.

జులై ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నందున వాటిల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ నెల 30వ తేదీలోపు టీకా వేయించుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలో సీఆర్‌పీ/ ఉపాధ్యాయుడు ఒకరు ఉంటారని, విద్యా సిబ్బంది తమ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు చూపించి టీకా వేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags