Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ITC to launch super app this year to tap small farmers' potential: Chairman

 

ITC to launch super app this year to tap small farmers' potential: Chairman

చిన్న రైతుల కోసం ఐటీసీ నుంచి సూపర్‌ యాప్‌ - ఆంధ్రప్రదేశ్‌లో పైలట్‌ ప్రాజెక్టులు 

ITC MAARS or 'Metamarket for Advanced Agriculture and Rural Services' 

ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ చిన్న రైతుల కోసం ఈ ఏడాది ఒక సూపర్‌ యాప్‌ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఐటీసీ మార్స్‌ లేదా ‘మెటామార్కెట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ సర్వీసెస్‌’ పేరుతో వస్తున్న ఈ యాప్‌ వల్ల ఐటీసీ ఇ-చౌపల్‌కు కొత్త రెక్కలు వస్తాయని, రైతులకు అవాంతరాలు లేని సేవలను అందించే ‘ఫిజిటల్‌’ వ్యవస్థ రూపొందుతుందని ఐటీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ పురి పేర్కొన్నారు.

‘ఐటీసీ-మార్స్‌ పలు వ్యవసాయ సేవలను అందిస్తుంది. ఈ యాప్‌కున్న సూక్ష్మ-సేవల నిర్మాణం వల్ల పలు వ్యవసాయ సాంకేతిక సొల్యూషన్లు లభిస్తాయి. ఇందులో హైపర్‌లోకల్‌ సేవలు, ఏఐ ఆధారిత సలహాలు, ఆన్‌లైన్‌ మార్కెట్‌లుంటాయి. ఇప్పటికే కంపెనీ ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దీనిపై కొన్ని పైలట్‌ ప్రాజెక్టులు(మిరప వేల్యూ చైన్‌పై) జరుగుతున్నాయి. దీనివల్ల ప్రస్తుత సీజనులో అదనంగా 26 శాతం ఆదాయం రైతులకు వచ్చే అవకాశం ఉంద’ని ఆయన వివరించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags