Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Public Examinations, 2020 & 2021: Procedure for Declaration of The Results– Final Report Submitted

 


SSC Public Examinations, 2020 & 2021: Procedure for Declaration of The Results– Final Report Submitted

2020 & 2021 సంవత్సరాల 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల ప్రకటన ప్రక్రియ - తుది నివేదిక గురించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

పదో తరగతి పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్ల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. 2020, 2021 పదో తరగతి ఫలితాల వెల్లడికి ఫార్ములా రూపకల్పన చేయాలని గతంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ నియమించిన సంగతి తెలిసిందే.

భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా 2019-2020 ఏడాదికి పాస్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన విద్యార్థులందరికీ గ్రేడ్‌ పాయింట్లు ఇవ్వాలని కమిటీ సూచించింది. అంతర్గతంగా 50 మార్కులు చొప్పున నిర్వహించిన 3 ఫార్మెటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ఉండనున్నాయి. అయితే, ఈ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు పాస్‌ గ్రేడ్‌ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటికి ఆమోదం తెలుపుతూ పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వులోని ముఖ్యాంశాలు ఇవే:

★ SSC public Exams 2020   లో Grades Award చేయుటకు SA1లో మార్కులు 50కు, 3FAలలో కలిపి మొత్తము మార్కుల 50 కు పరిగణనలోకి తీసుకొని మొత్తము 100 కు ఎన్ని మార్కులు వచ్చిన వో దానిని బట్ఝి గ్రేఢులు నిర్ణయిస్తారు.

★ SSC Public Exams 2021 లో గ్రేడులు:

రెండు FA లలో Slip test (20Marks) లో 70%, CCE Marks for Other components(10+10+10) లో 30% మార్కులను కలిపి మొత్తము 100 మార్కులకు పొందిన మార్కుల ఆధారంగా గ్రేడులు ఇస్తారు. No fail. Last Grade ఇవ్వబడును.

★ FA లు వ్రాయని వారికి, లేక ఆ మార్కులు Online చేయని Students కు Last grade ఇచ్చి Pass చేస్తారు.

★ 2020 కు ముందు SSC చదివి 2017,2018,2019 పరీక్షల్లో కొన్ని Subjects Fail అయిన వారికి ఆ Subjects లో Internal marks   ను బట్టి లేక 20 అంతర్గత మార్కులకు ఎన్ని వచ్చినా వో వాటిని 5 చే గుణించి 100 కు వచ్చిన మార్కులను బట్టి గ్రేడులు లేక Last grade ఇస్తారు.

School Education - SSC Public Examinations, 2020 & 2021 – Cancelled due to COVID Situation in the state – Constitution of High-Power Committee to evolve the procedure for declaration of the results of SSC Public Examinations – Final Report Submitted – Approval of Recommendations of the Committee – Orders - Issued.

G.O.MS.No. 46 Dated: 02-08-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags