Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (02-08-2021)

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు సమాధానాలు (02-08-2021)

 

1. ప్రశ్న:

సార్, నవంబర్ 2019 లో 30 రోజులు EL surrenderచేసి క్యాష్ చేసుకున్నాను. 300 రోజులు వున్నాయి. ఈ జూన్ లో 30రోజులు సరెండర్ చేస్తే ట్రెజరీ వారు రాదంటున్నారు. నవంబర్ లో పెట్టుకోవచ్చు అంటున్నారు. 300రోజులున్నా అంతేనా? వివరించగలరు.

జవాబు:

15 రోజులు సరెండర్ చెయ్యాలంటే 12 నెలలు, 30 రోజులు సరెండర్ చెయ్యాలంటే 24 నెలల గ్యాప్ తప్పనిసరి. అయితే 285 రోజుల కన్నా ఎక్కువ ఉంటే 12 నెలలు పూర్తి కాకపోయినా 15 రోజులు సరెండర్ చేసుకోవచ్చని మినహాగింపు ఉందే తప్ప, 24 నెలలు పూర్తి కాకపోయినా 30 రోజులు సరెండర్ చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నట్లు నాకు తెలిసి లేదు.

--------------------------------------

2. ప్రశ్న:

రిటైర్మెంట్ వయస్సును 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకి పెంచినందున పెరిగిన 3 సంవత్సరాల కాలం పెన్షనుకు కౌంటు చేస్తారా? సాధారణ వార్షిక హెచ్చింపు (AGI) వస్తుందా? AAS తీసుకోవచ్చా? ఇంకా ఇతర బెనిఫిట్స్ అన్నీ వర్తిస్తాయా? తదితర సందేహాలు చాలా మంది మిత్రుల నుండి వస్తున్నాయి.

జవాబు:

రిటైర్మెంట్ వయస్సును 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పెంచిన కాలానికి ఎలాంటి రెష్టిక్షన్స్ ఉత్తర్వులు ఇవ్వలేదు. కావున పెరిగిన కాలానికి ప్రస్తుతం ఉన్న అన్ని రకాల బెనిఫిట్స్ వర్తిస్తాయి.

-----------------------------------------

3. ప్రశ్న:

ఒక ఉద్యోగిని సరెండర్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సరెండర్ వలన ఏదైనా సమస్య ఉంటుందా ? అనగా ఇంక్రిమెంట్ ఆపేయడం లేదా జీతం నిలుపుదల చేయడం అలాంటివి.

జవాబు:

*మన క్రింద పని చేసే ఉద్యోగిపై మనం చర్యలు తీసుకునే అధికారం లేనపుడు, లేదా ఎవరైనా ఉద్యోగి సేవలు మనకు అవసరం లేనపుడు సరెండర్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఫారిన్ సర్వీస్ లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అలాగే జిల్లా అధికారుల పనితీరు సంతృప్తిగా లేదని భావించినపుడు కలెక్టర్లు కూడా సరెండర్ చేస్తూ ఉంటారు.

సరెండర్ వలన సమస్య ఏమీ రాదు. సరెండర్ చేయడానికి గల కారణాల వల్ల ఇబ్బంది ఉండొచ్చు. ఒక ఉద్యోగితో అవసరం లేదని పరిపాలనా కారణాల వల్ల సరెండర్ చేస్తే ఏమీ ఇబ్బంది ఉండదు. ఒక ఉద్యోగితో ఇబ్బందిగా ఉండటం వల్ల లేదా తప్పులు చేయడం వల్ల వద్దనుకుని నెగటివ్ రిమార్కులతో సరెండర్ చేస్తే ఇబ్బంది ఉండొచ్చు.

Borrowing authority/Controlling authority... where he was not in the capacity of disciplinary power on the individual. he surrenders only.

--------------------------------------------

4. ప్రశ్న:

సర్వీసు రెగ్యులరైజేషన్ కు మరియు ప్రొబెషన్ డిక్లేర్ కు యాంటిసిడెంట్స్ రిపోర్ట్ తప్పనిసరా? ఏ రూల్స్ ప్రకారంగా చెప్పగలరు.

జవాబు:

అవును. సర్వీసు రెగ్యులరైజేషన్ డిక్లేర్ చేయుటకు తప్పనిసరిగా ఉండాలి. Under Rule 9 (1) (b) of the Ministerial Services Rules, 1998

అలాగే ప్రొబెషన్ డిక్లేర్ కు సంబంధించి

16. (a) COMMENCEMENT OF PROBATION FOR DIRECT RECRUITS: A person appointed in accordance with the rules, otherwise than under rule 10, by direct recruitment shall commence his probation from the date of his joining the duty or from such other date as may be specified by the appointing authority: Provided that a person having been appointed temporarily under rule-10 to a post in any service, class or category or having been so appointed otherwise than in accordance with the rules governing appointment to such post, is subsequently appointed to the same post, in the same service or class or category, in the same unit of appointment, in accordance with the rules, shall commence his probation from the date of such subsequent appointment or from such earlier date as the appointing authority may determine, subject to the condition that his commencement of probation from an earlier date shall not adversely affect any person who has been appointed earlier or simultaneously, to the same service, class or category in the same unit.

AP State & Subordinate Service Rules 1998

(c) Period of Probation:

Direct Recruits: Two years on duty within a continuous period of 3 years.

Appointment by Transfer/Promotion: One year on duty within a continuous period of 2 years.

Previous
Next Post »
0 Komentar

Google Tags