Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WhatsApp Introduces A 'View Once' Feature That Deletes Photos or Videos Immediately After They Are Opened

 

WhatsApp Introduces A 'View Once' Feature That Deletes Photos or Videos Immediately After They Are Opened

WhatsApp New Feature: ‘వ్యూ వన్స్’ ఫీచర్ యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చింది

ఇతర మెసేజింగ్ యాప్‌లకు ధీటుగా వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తూ యూజర్స్‌ని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే మల్టీ డివైజ్ సపోర్ట్‌, ఛాట్ బ్యాక్‌అప్‌కి ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌, వ్యూ వన్స్‌ వంటి ఫీచర్స్‌ని పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో డిస్‌అప్పియరింగ్ మెసేజింగ్‌ కోసం అభివృద్ధి చేసిన ‘వ్యూ వన్స్’ ఫీచర్స్‌ని తాజాగా యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్‌ ఇతరులకు పంపే మెసేజ్‌లను అవతలి వారు ఒక్కసారి చూసిన వెంటనే డిలీట్‌ లేదా డిస్‌అప్పియర్ అయిపోతాయి. మరి ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది..దీంతో ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం.

* మీరు ఏదైనా ఫొటో/వీడియో/గిఫ్‌లను వాట్సాప్‌లో ఇతరులకు పంపితే, అవతలి వ్యక్తి వాటిని కేవలం ఒక్కసారే చూసేలా చేయడమే ఈ వ్యూ వన్స్‌ ఫీచర్‌ ఉపయోగం. అలానే ఈ ఫీచర్‌ ద్వారా ఫైల్‌ పంపితే ప్రివ్యూ కనిపించదు. అవతలి వారు దానిపై క్లిక్ చేసి చూసిన తర్వాత ఛాట్ స్క్రీన్‌ నుంచి బయటికి వచ్చిన వెంటనే రిసీవర్‌, సెండర్ ఛాట్ స్క్రీన్ల నుంచి సదరు ఫైల్‌ డిలీట్ అయిపోతుంది. వాట్సాప్ ద్వారా ముఖ్యమైన సమాచారం షేర్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. అలానే వ్యూ వన్స్‌ ద్వారా పంపిన మెసేజ్‌లు ఫార్వార్డ్, సేవ్‌, స్టార్డ్‌ మెసేజ్‌‌, షేర్ చేయలేరు.

* ఈ ఫీచర్‌ ద్వారా మెసేజ్‌ పంపిన 14 రోజుల లోపల రిసీవర్‌ ఓపెన్ చేయకుంటే ఆ డేటా వాటంతటవే డిలీట్ అయిపోతుంది. ఒకవేళ వాట్సాప్‌లో బ్యాక్‌అప్‌ చేసే సమయానికి వ్యూ వన్స్‌ ఫీచర్‌ ద్వారా వచ్చిన ఫైల్స్ ఓపెన్‌ చేయకుంటే అవి బ్యాక్‌అప్‌లో స్టోర్‌ అవుతాయి. అలానే మీరు ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్‌ షాట్ లేదా స్క్రీన్‌ రికార్డింగ్ చేసిన అవతలి వారికి తెలియదు. వ్యూ వన్స్‌ ద్వారా వచ్చిన మెసేజ్‌లపై యూజర్‌ ఫిర్యాదు చేయాలనుకుంటే మాత్రం సాధారణ మెసేజ్‌ల తరహాలోనే వాటికి సంబంధించిన మీడియా ఫైల్స్‌ని వాట్సాప్‌కి తప్పక సమర్పించాలి. 

* అలానే గ్రూప్‌ ఛాట్‌లలోనూ ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా పంపిన ఫైల్‌ని గ్రూపు సభ్యులు అందరూ చూశాక మాత్రమే డిస్‌అప్పియర్ అవుతుంది. ఇప్పటికే కొద్ది మంది యూజర్స్‌కి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మరి కొద్ది రోజుల్లో యూజర్స్ అందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags