TS: నేడు రాష్ట్ర
వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు –
పలు పరీక్షలు వాయిదా – వివరాలు ఇవే
నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా
సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గులాబ్ తుపాను ప్రభావం
కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
గులాబ్ తుపాను నేపథ్యంలో భారీ
వర్షాల కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్
అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌తో తాజా పరిస్థితులపై సీఎం
సమీక్షించారు. గులాబ్ తూపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు
రోజుల పాటు కురుస్తాయని.. ఈ పరిస్థితుల్లో ఏ విధమైన ప్రాణ, ఆస్తి
నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
* అంబేడ్కర్ ఓపెన్
వర్సిటీ పరీక్షలు వాయిదా
డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 28, 29న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఈ రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ చూడాలని, స్టడీ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాలు www.braouonline.in లో పొందొచ్చని పేర్కొన్నారు.
* పీఈ సెట్ పరీక్ష అక్టోబర్ 23కి
వాయిదా
ఈ నెల 30న
జరగాల్సిన పీఈ సెట్ వాయిదా పడింది. వర్షాల వల్ల పీఈ సెట్ శారీరక ధారుడ్య
పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు కన్వీనర్ వెల్లడించారు. ఈ పరీక్షలు అక్టోబర్ 23కు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
* OU లోని 28, 29 న జరగవలసిన పరీక్షలన్నీ వాయిదా.
0 Komentar