Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: LANGUAGE IMPROVEMENT PROGRAMME (LIP) (100 Day Programme)

 

AP: LANGUAGE IMPROVEMENT PROGRAMME (LIP) (100 Day Programme) 


UPDATE 09-11-2021

ప్రభుత్వ పాఠశాలల్లో ‘లిప్‌’ - తూ.గో, ప.గో, కృష్ణా జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 

ప్రభుత్వ పాఠశాలల్లో భాషాభివృద్ధి కార్యక్రమాన్ని(లిప్‌) ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ఈనెల 10 నుంచి అమలు చేయనున్నారు. కాకినాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ)మధుసూదన్‌ దీన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 100రోజులపాటు విద్యార్థులకు ఆయా తరగతుల వారీగా రోజుకు కొన్ని పదాలను తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో నేర్పిస్తారు. 1, 2 తరగతులకు రోజుకు రెండు, 3-5వారికి మూడు పదాలను తెలుగు, ఆంగ్లంలో పరిచయం చేస్తారు.

6-10 తరగతుల విద్యార్థులకు రోజుకు ఐదు పదాల చొప్పున మూడు భాషల్లో నేర్పిస్తారు. తరగతిలో పాఠం ప్రారంభించే ముందు ఆయా మాధ్యమాల ఉపాధ్యాయులు విద్యార్థులకు పదాలను నేర్పిస్తారు. ఇందుకోసం విద్యార్థులతో ప్రత్యేక నోట్‌బుక్‌ ఏర్పాటు చేయించి, ముందు రోజు నేర్పిన పదాలను తరగతిలో పునశ్చరణ చేయిస్తారు. విద్యార్థులు మూడు భాషలను నేర్చుకునేందుకు ఈ విధానాన్ని రూపొందించినట్లు ఆర్జేడీ మధుసూదన్‌ తెలిపారు. అభ్యసన సామర్థ్యాలను పరీక్షించేందుకు ఉపాధ్యాయులు ప్రతి 15రోజులకోసారి పరీక్ష నిర్వహించి, మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారని వెల్లడించారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందిస్తామని, పాఠశాలలకు విద్యార్థుల ప్రతిభ ఆధారంగా స్టార్‌ రేటింగ్‌ ఇస్తామని తెలిపారు. 

LIP November Words:

లిప్ కార్యక్రమం లో భాగంగా నవంబర్ నెల లో విద్యార్థులకు నేర్పవలసిన పదాలు: 

నవంబర్ నెలలో 17వర్కింగ్ డేస్ కోసం రేపటినుండి 1-2 తరగతులకు రోజుకు 2 పదాలు, 3 to 5 తరగతులకు రోజుకు 3 పదాలు, 6,7,8,9,10 తరగతులకు రోజుకు 5 పదాలు తో అటాచ్ చేయడం జరిగినది.

Rc.No.Spl/A5/2021   Dated: 09.11.2021

Sub: School Education – Quality Education – Implementation of an Innovative programme called LANGUAGE IMPROVEMENT PROGRAMME (LIP) (100 Day Programme) in all Government management schools except private un aided schools in Zone -II – words list to be taught for the month of November 2021 – Action Plan – communicated – Reg.

DOWNLOAD PROCEEDINGS        

==================

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులలో పద సంపదను పెంపొందించడం ద్వారా భాషా నైపుణ్యాలను సమగ్రంగా అలవర్చేందుకు విద్యాశాఖ అధికారులు ‘లిప్‌’ (లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంటు ప్రోగ్రామ్‌)ను రూపొందించారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు కానుంది. ఈ జిల్లాల్లో కార్యక్రమం పురోగతి, ఫలితాలు, ఇతర అంశాలను సమీక్షించిన అనంతరం ఇతర జిల్లాల్లో అమలు చేయించనున్నారు. కోవిడ్‌ కారణంగా పాఠశాలలు చాలా రోజులుగా మూతపడి ఉండడంతో బోధనాభ్యసన ప్రక్రియలు నిలిచిపోయి విద్యార్ధుల సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడింది. 

ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లోని విద్యార్ధులు గతంలో నేర్చుకున్న అంశాలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా భాషా సామర్థ్యాలు లోపిస్తున్నాయి. విద్యార్దులలో భాషా సామర్ధ్యాలను పెంచేందుకు ప్రభుత్వం విద్యాకానుక కింద విద్యార్ధులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, వర్కుబుక్కులు, నోట్‌బుక్కులతో పాటు ఈ విద్యాసంవత్సరంలో ఆంగ్లం, తెలుగు డిక్షనరీలను కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీటి ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు చేరుకోవడానికి వీలుగా లిప్‌ కార్యక్రమం రూపొందించారు. 

ప్రతిరోజూ కొత్త పదాల అభ్యాసం 

ఈ లిప్‌ కార్యక్రమాన్ని తెలుగు, ఇంగ్లీషు భాషల్లోని పదాలను విద్యార్ధులు అవగతం చేసుకొని నేర్చుకొనేలా 100 రోజుల పాటు సమగ్ర  ప్రణాళికతో అమలు చేయనున్నారు. 1, 2, తరగతుల విద్యార్ధులు ప్రతి రోజూ రెండేసి కొత్త పదాలను, 3 నుంచి 5వ తరగతి వరకు విద్యార్ధులు మూడేసి పదాలను (ఆంగ్లం, తెలుగులలో), 6 నుంచి 10వ తరగతి విద్యార్ధులు ఐదేసి పదాలను (ఆంగ్లం, తెలుగు, హిందీ భాషలలో) రోజూ నేర్చుకొనేలా చేస్తారు. తద్వారా ప్రణాళిక ముగిసే సరికి ఆంగ్ల, తెలుగు, హిందీ భాషలలో కలిపి 12 తరగతుల విద్యార్ధులు 400 పదాలను, 3 నుంచి 5వ తరగతి విద్యార్ధులు 600 పదాలను, 6 నుంచి 10వ తరగతి విద్యార్ధులు 1500 పదాలను నేర్చుకొనేలా చేస్తారు. ఆ భాషలలో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలు విద్యార్ధులలో పెంపొందేలా చేస్తారు. 

అమలు విధానం 

విద్యాకానుక కింద అందించిన ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, ప్రాధమిక విద్యార్ధులకోసం  ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన చిత్రాలతో కూడిన డిక్షనరీల నుంచి రోజూ ఈ పదాలను విద్యార్ధులకు నేర్పించనున్నారు. పాఠ్యప్రణాళికలో భాగంగానే ఆయా భాషోపాధ్యాయులు తమ తరగతి బోధన ప్రారంభించే ముందు ఈ కొత్త పదాలపై విద్యార్ధులతో అభ్యాసం చేయిస్తారు. ఈ పదాలను విద్యార్ధులతో ప్రత్యేక నోట్‌బుక్కులో అభ్యాసం చేయిస్తారు. ఈ పదాలను ఒక క్రమపద్ధతిలో నేర్పించడానికి అవసరమైన పదజాల పట్టికను భాషా నిపుణులతో రూపొందించి పంపిణీ చేయిస్తారు. 

ఈ పదాలను విద్యార్ధులు ఏమేరకు అవగాహన చేసుకున్నారన్న విషయాన్ని తెలుసుకొనేందుకు ప్రతి 15 రోజులకోసారి 15 పదాలతో పరీక్షను నిర్వహిస్తారు. విద్యార్దులకు వీటి ఆధారంగా ఏ, బీ, సీ, డీ,   గ్రేడ్లు ఇస్తారు. ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తూ ప్రతి విద్యార్థి ఏ గ్రేడ్‌లోకి వచ్చేలా చేస్తారు. అలాగే పాఠశాలల వారీగా ప్రతినెల సమీక్షించి వాటికి స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని 11,20,862 విద్యార్ధులు, పాఠశాలల టీచర్లు, ఎంఈఓలు, డీఈఓలు ఈ కార్యక్రమం అమలులో భాగస్వాములుగా ఉంటారని ఈ కార్యక్రమం రూపొందించి అమలు చేస్తున్న జోన్‌2 రీజనల్‌ జాయింట్‌ డైరక్టర్‌ డి.మధుసూదనరావు పేర్కొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags