Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Longest Lunar Eclipse of This Century Will Take Place on November 19

 

Longest Lunar Eclipse of This Century Will Take Place on November 19

ఈ కార్తిక పౌర్ణమి నాడు శతాబ్దపు సుదీర్ఘ పాక్షిక చంద్ర గ్రహణం  - సుమారు 3గంటల 28 నిమిషాల పాటు దర్శనం

580 ఏళ్ల తర్వాత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం - 19న ఈశాన్య భారతదేశంలో దర్శనం 

గడిచిన 580 ఏళ్లలో ఎన్నడూ లేనంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఈ నెల 19న చోటుచేసుకోనుంది. ఇది ఈశాన్య భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం ఈ పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ఆరంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానెటోరియం పరిశోధన విభాగం డైరెక్టర్‌ దేవీ ప్రసాద్‌ దువారి తెలిపారు. మొత్తం 3 గంటల 28 నిమిషాల 24 సెకన్ల పాటు ఇది సాగుతుందన్నారు. అది అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుందని పేర్కొన్నారు. అది కూడా చంద్రోదయం తర్వాత గ్రహణంలోని చిట్టచివరి ఘట్టం మాత్రమే దర్శనమిస్తుందన్నారు.

ఈ దఫా జరిగే పాక్షిక చంద్రగ్రహణంలో గరిష్ఠ దశ మధ్యాహ్నం 2.34 గంటలకు చోటుచేసుకోనుంది. ఆ సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని భూమి నీడ 97 శాతం మేర కప్పేస్తుంది. గ్రహణ సమయంలో జాబిల్లి అరుణ వర్ణంలో కనిపించే అవకాశం ఉంది. ఆ సమయంలో సూర్యకాంతిలోని అరుణ వర్ణపు పుంజాలు భూ వాతావరణంలోకి ప్రవేశించి, ఆ తర్వాత పరావర్తనం చెంది, చంద్రుడిపై పడినప్పుడు ఇది చోటుచేసుకుంటుంది. పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్‌ ప్రాంతంలో కనిపిస్తుంది.

ఈ పరిణామానికి ముందు, తర్వాత జరిగే పెనంబ్రల్‌ గ్రహణం ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఇది అంత స్పష్టంగా కనిపించదు. చివరిసారిగా ఇంత సుదీర్ఘ చంద్రగ్రహణం 1440 సంవత్సరంలో ఫిబ్రవరి 18న చోటుచేసుకుంది. మళ్లీ 2669 సంవత్సరంలో ఫిబ్రవరి 8న అది సంభవిస్తుంది.

=======================

శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం (Century Longest Lunar Eclipse) నవంబరు 19న (కార్తిక పౌర్ణమి నాడు)వినువీధిలో దర్శనమివ్వబోతుంది. ఇదే విషయాన్ని శనివారం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ (నాసా) ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుండగా.. భారతకాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి .. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. 3 గంటల 28 నిమిషాల పాటు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణం.. చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది.  ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం. ఈ ఏడాది తొలి చంద్ర గహణం.. మే 26 రోజున (వైశాఖ పౌర్ణమి) నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. నిండు చంద్రుడు ఆరోజు అరుణవర్ణంలో కనువిందు చేశాడు. దీన్నే బ్లడ్‌ మూన్ (Blood moon), సూపర్‌ మూన్‌ (Super Moon) అని అంటారు.

భారత్‌తో పాటు ఏ దేశాల్లో కనిపిస్తుందంటే..

* భారత్‌లోని అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గ్రహణాన్ని వీక్షించొచ్చు. అలాగే ఉత్తర అమెరికాలోని 50దేశాలతో పాటు మెక్సికో వాళ్లూ దీన్ని పూర్తిగా చూడొచ్చు.

* అమెరికా తూర్పు తీరంలో రాత్రిపూట చూసేవారు అద్భుతాన్ని తెల్లవారుజామున 2 నుండి 4 గంటల వరకూ చూడొచ్చు. పశ్చిమ తీరంలో ఉన్నవారు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశముందని నాసా పేర్కొంది.

* ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా., పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు ఈ పాక్షిక చంద్ర గ్రహణం దర్శనమివ్వబోతోంది. 

ఈ గ్రహణాన్ని ‘ఫ్రాస్ట్‌ మూన్‌’గా పిలుస్తారు.. ఎందుకంటే..

కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణాన్ని.. మంచుతో కప్పబడిన చంద్రుడిగా ఫ్రాస్ట్ మూన్ (Frost Moon) అని పిలుస్తారు. శరదృతువు (Autumn Season) చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. శరదృతువు చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరు పెట్టారు. భూమి యొక్క నీడతో చంద్రుడు పూర్తిగా నల్లబడటం వల్ల సంపూర్ణ చంద్రగ్రహణంలా ఇది అద్భుతమైనది కానప్పటికీ, ఈ పాక్షిక గ్రహణం చంద్రుని ఉపరితలంలో 97% కనిపించకుండా దాచేస్తుంది.

మరికొన్ని ఆసక్తికర విషయాలు

వచ్చే 80 సంవత్సరాలలో 2021, 2030 మధ్య 20 సంపూర్ణ, పాక్షిక, పెనుంబ్రల్ గ్రహణాలు ఏర్పడే అవకాశముందని నాసా వెల్లడించింది. 2001 నుంచి 2100 శతాబ్దం మధ్య అత్యంత ఈ పాక్షిక చంద్రగ్రహణమే సుదీర్ఘమైనది కాగా 21వ శతాబ్దంలో ఇప్పటి వరకూ 228 చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి.ఈ ఏడాదికి ఇదే ఆఖరి కాగా చివరి చంద్ర గ్రహణం కాగా.. వచ్చే ఏడాది 2022, మే 15-16 తేదీల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం (బ్లడ్‌ మూన్) ఏర్పడనుంది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags