Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Maha Vir Chakra for Galwan hero Colonel Santhosh Babu

 

Maha Vir Chakra for Galwan hero Colonel Santhosh Babu

సంతోష్‌బాబుకు మహావీర్‌చక్ర - రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించిన భార్య సంతోషి, తల్లి మంజుల

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో గతేడాది చైనా సైనికులతో పోరులో అమరుడైన కర్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌బాబుకు యుద్ధకాలంలో ఇచ్చే రెండో అత్యున్నత శౌర్య పురస్కారం మహావీర్‌చక్రను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సంతోష్‌బాబు భార్య సంతోషి, మాతృమూర్తి మంజుల ప్రథమ పౌరుడి నుంచి పురస్కారాన్ని స్వీకరించారు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబు 16 బిహార్‌ రెజిమెంట్‌కు కమాండింగ్‌ అధికారిగా పనిచేసేవారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ‘మహా వీర్‌చక్ర’ అందుకొంటున్న కర్నల్‌ బి.సంతోష్‌బాబు కుటుంబీకులు 

* పురస్కారాన్ని స్వీకరించడం తనకు, తన కుటుంబానికి గర్వకారణమని కర్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి పేర్కొన్నారు. పురస్కారం స్వీకరించి, మీడియాతో మాట్లాడారు. ‘నా భర్త దేశం కోసం నిస్వార్థమైన త్యాగం చేశారు. నాకెప్పుడైనా విచారంగా అనిపిస్తే.. ఇదే అంశాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆ పరిస్థితిని అధిగమిస్తాను’ అని వ్యాఖ్యానించారు. 

సేవా పురస్కారాలు 

సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (ఎంసీఈఎంఈ) కమాండెంట్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ టీఎస్‌ఏ నారాయణన్‌ను కేంద్రం అతి విశిష్ట్‌ సేవా పురస్కారంతో సత్కరించింది. భారత వైమానిక దళాధిపతి (ఐఏఎఫ్‌) ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి, నౌకాదళాధిపతిగా బాధ్యతలు చేపట్టనున్న వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరికుమార్‌కు కేంద్రం పరమ్‌ విశిష్ట్‌ సేవా పురస్కారాలను ప్రదానం చేసింది. మరి కొందరికి ‘వీర్‌ చక్ర’, ‘కీర్తి చక్ర’, ‘శౌర్య చక్ర’లు లభించాయి.

కల్నల్ సంతోశ్‌బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహం ఆవిష్కరణ

Previous
Next Post »
0 Komentar

Google Tags