AP EAPCET-2022: All the Details Here
ఏపీ ఈఏపీ సెట్ 2022: పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత
విద్యామండలి (ఏపీఎస్ సీహెచ్ ఈ) ఏపీఈఏపీసెట్-2022 నోటిఫికేషన్ విడుదల
చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్,
ఫార్మసీ కోర్సుల్లో ఆ ప్రవేశాలు కల్పిస్తారు. 2022 విద్యాసంవత్సరానికిగాను ఈ పరీక్షను ఈ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్
యూనివర్సిటీ, అనంతపురం నిర్వహిస్తోంది.
ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీ
తొలగింపు
ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్)లో
ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించారు. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే
ర్యాంకులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఇంటర్ రెండో ఏడాది చదివిన విద్యార్థులు మొదటి
సంవత్సరంలో ఉన్నప్పుడు కరోనా కారణంగా మార్చిలో పరీక్షలు నిర్వహించలేదు.
విద్యార్థులందరికీ ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు. ఎవరైనా మార్కులు ఎక్కువ
కావాలనుకుంటే సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవాలని ఇంటర్ విద్యామండలి సూచించింది.
చాలా మంది విద్యార్థులు సప్లిమెంటరీ
పరీక్షలు రాశారు. ఎవరైనా అభ్యర్థులు ఈ పరీక్షలు రాయకపోతే నష్టపోతారనే ఉద్దేశంతో
ఇంటర్ మార్కులను వెయిటేజీని తొలగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
ఈఏపీసెట్‌ను 160 మార్కులకు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఇంటర్‌లో
30శాతం పాఠ్యప్రణాళిక తగ్గించినందున ప్రవేశ పరీక్షలోనూ ఆ
పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇవ్వరు.
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్
అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్-2022)
కోర్సులు:
1. ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్
టెక్నాలజీ)
2. బీఎస్సీ(అగ్రికల్చర్ /
హార్టికల్చర్)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎస్ఎస్సీ.
3. బీఫార్మసీ, ఫార్మా డీ.
అర్హత: ఇంటర్మీడియట్(సైన్స్/
మ్యాడ్స్)/ 10+2 (సైన్స్/ మ్యాడ్స్ సబ్జెక్టులు)/ డిప్లొమా/ తత్సమాన
ఉత్తీర్ణత.
వయసు: కనీసం 16
ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో
మెరిట్,
ఆన్లైన్ కౌన్సెలింగ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఇంజినీరింగ్/
అగ్రికల్చర్ అభ్యర్థులు ఓసీ-రూ.600, బీసీ-రూ.550, ఎస్సీ/ ఎస్టీ-రూ.500
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
11.04.2022
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.05.2022 (ఆలస్య రుసుం లేకుండా)
పరీక్ష తేది: సంబంధిత కోర్సును
అనుసరించి 04.07.2022 నుంచి 12.07.2022 వరకు
నిర్వహిస్తారు.
INSTRUCTION
BOOKLET FOR ENGINEERING
INSTRUCTION
BOOKLET FOR AGRICULTURE & PHARMACY
ENGINEERING
STREAM (E) SYLLABUS
0 Komentar