Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC CAPF Exam 2022: Notification Released for 253 Posts – Details Here

 

UPSC CAPF Exam 2022: Notification Released for 253 Posts – Details Here

యూ‌పి‌ఎస్‌సి: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్ 2022 – పూర్తి వివరాలు ఇవే

బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సీఏపీఎఫ్-2022 ప్రకటన విడుదల చేసింది.

అసిస్టెంట్ కమాండెంట్లు

మొత్తం ఖాళీలు: 253

1) బీఎస్ఎఫ్: 66

2) సీఆర్పీ ఎఫ్: 29

3) సీఐఎస్ఎఫ్: 62

4) ఐటీబీపీ: 14

5) ఎస్‌ఎస్‌బీ: 82

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. 2022లో డిగ్రీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏపీఎఫ్ పరీక్ష 2022కి కావల్సిన నిర్దిష్ట శారీరక, ఆరోగ్య ప్రమాణాలు కలిగి ఉండాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్/ ఎఫిషియన్సీ టెస్టులు, ఇంటర్వ్యూ) పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం | 12 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నాం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు.

పేపర్-1లో జనరల్ ఎబిలిటీ, ఇంటలిజెన్స్ విభాగాలు ఉంటాయి. దీన్ని 250 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిన్ పద్ధతిలో ఉంటాయి. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.

పేపర్-2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగాలు ఉంటాయి. దీన్ని 200 మార్కులకు నిర్వహిస్తారు.

పరీక్ష తేది: 07.08.2022.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.04.2022

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.05.2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags