కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా
పేరు మార్పు - రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం!
======================
కోనసీమ జిల్లా ఇక నుండి డా.బి ఆర్
అంబేడ్కర్ కోనసీమ జిల్లా - ప్రాథమిక నోటిఫికేషన్ (e-GAZETTE) విడుదల
THE ANDHRA PRADESH DISTRICTS (FORMATION)
ACT, 1974 - CHANGE OF NAME OF THE KONASEEMA DISTRICT AS “Dr. B.R. AMBEDKAR KONASEEMA
DISTRICT” - PRELIMINARY NOTIFICATION.
======================
కొత్త జిల్లా కోనసీమ జిల్లా పేరు
మారనుంది. ఆ జిల్లా పేరును డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల
కానుంది.
అమలాపురం కేంద్రం ఏర్పాటు చేసిన
కోనసీమ జిల్లాకు డా.బీఆర్.అంబేడ్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు,
వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా
జరిగాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బీఆర్.అంబేడ్కర్ పేరును చేరుస్తూ
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
0 Komentar