Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WhatsApp Tips and Tricks - You Must Know

 

WhatsApp Tips and Tricks - You Must Know

వాట్సాప్‌లో తెలుసుకోవాల్సిన పది ట్రిక్స్‌ ఇవే! 

వాట్సాప్‌ వాడని వారు.. యాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ లేదంటే అతిశయోక్తి కాదు.. వాట్సాప్‌లో తెలియని కొన్ని ఫీచర్లు కూడా దాగి ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. మరి ఆ హిడెన్‌ ఫీచర్ల ఏంటి? వాటిని ఎలా వాడాలనే ట్రిక్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. టెక్ట్స్‌ ఫార్మాట్‌:

వాట్సాప్‌లో మనం ఒకే విధమైన టెక్ట్స్‌ ఫార్మాట్‌ ఉందనుకుంటాం. ఆ భ్రమలోనే ఉండిపోకండి. మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ తరహాలోనే టెక్ట్స్‌ను బోల్డ్‌ (Bold), ఇటాలిక్‌ (italic) ఫార్మాట్లో మార్చుకోవచ్చు. టెక్ట్స్‌ ముందు, వెనుక (*) పెడితే బోల్డ్‌లోకి, (_) పెడితే ఇటాలిక్‌ ఫార్మాట్‌లోకి మారుతుంది. అంతేకాదు టెక్ట్స్‌ను మధ్యలోకి స్ట్రైక్‌ చేయాలంటే (~) అనే సింబల్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

2. స్టార్‌ టెక్ట్స్‌’ ఆప్షన్‌:

మనకు నచ్చిన మెసేజ్‌, ఇమేజ్‌ను సేవ్‌ చేసి వీలైనపుడు సులభంగా ఓపెన్‌ చేయడానికి ‘స్టార్‌ టెక్ట్స్‌’ అనే ఆప్షన్‌ ఉపయోగపడుతుంది.  దీనికోసం మెసేజ్‌, ఇమేజ్‌ మీద లాంగ్‌ ప్రెస్‌ చేస్తే పైన స్టార్‌ సింబల్ కనిపిస్తోంది. దీన్ని సెలెక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం దేనైతే సెలెక్ట్‌ చేశామో ఆ మెసేజ్, ఇమేజ్‌ పక్కన స్టార్‌ సింబల్‌ గుర్తు ప్రత్యక్షం అవుతుంది.

3. ఎక్కువగా ఇంటారాక్ట్‌ ఎవరితో?

వాట్సాప్‌లో మనం ఎవరితో ఎక్కువగా చాట్‌ చేశాం, ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకున్నామనే దాన్ని కూడా తెలుసుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్‌లోకెళ్లి స్టోరేజీ అండ్‌ డేటాపై క్లిక్‌ చేయాలి. అందులో డేటా మేనేజ్‌మెంట్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. తర్వాత మనం ఎంత మందితో ఎక్కువగా ఇంటారాక్ట్‌ అయ్యామనే తెలుపుతూ ఒక లిస్ట్‌ ఓపెన్‌ అవుతుంది. కాంటాక్ట్‌ పక్కన స్టోరేజీ సైజు కూడా కనిపిస్తోంది. ఒక్కో కాంటాక్ట్‌పై క్లిక్‌ చేసి ఏం ఏం ఫైల్స్‌ షేర్‌ చేశాం. ఎప్పటివరకు చేశామనే ఇతరత్రా వివరాలు కూడా తెలుసుకోవచ్చు.

4. ‘డిస్‌ అపియరింగ్‌ మెసేజెస్‌’ ఉపయోగం:

వాట్సాప్‌లో మనకు వచ్చిన, మనం పంపిన మెసేజ్‌లను ఎప్పటికప్పుడు డిలీట్‌ చెయ్యాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దీన్నే సులభతరం చేయడానికి డిస్‌ప్పియరింగ్‌ చాట్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. దీంతో మెసేజ్‌లు మనం ఎంచుకున్న విధంగా నిర్దిష్ట సమయం తర్వాత వాటంతటవే డిలీట్‌ అయిపోతాయి. దీనికోసం కాంటాక్ట్‌ నేమ్‌పై క్లిక్‌ చేస్తే ‘డిస్‌ అపియరింగ్‌ మెసేజెస్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని టర్న్‌ ఆన్‌ చేసుకోవాలి.

5. వేర్వేరు నోటిఫికేషన్‌ ట్యూన్‌:

మన కాంటాక్ట్‌లో ఉన్న ముఖ్యమైన వారు మెసేజ్‌ చేస్తే సులువుగా గుర్తించేలా నోటిఫికేషన్‌ను మార్చుకోవచ్చు. కాంటాక్ట్‌పై క్లిక్‌ చేసి కస్టమ్‌ నోటిఫికేషన్‌లో టోన్‌ మార్చుకుంటే ఎవరు మెసేజ్‌ చేశారో సులువుగా కనిపెట్టవచ్చు.

6. మ్యూట్‌ ఆప్షన్‌:

వాట్సాప్‌లో పదేపదే మెసేజ్‌లు వచ్చే గ్రూప్/మెంబర్లతో విసుగెత్తిపోతే వాటిని మ్యూట్‌ చేసుకోవచ్చు. దీనికోసం కాంటాక్ట్‌పైనా లాంగ్‌ ప్రెస్‌ చేసి మ్యూట్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి.

7. చాట్ ఆర్చీవ్‌ ఆప్షన్:

వాట్సాప్‌లో ఏదైనా చాట్‌ను దాచేయాలనుకుంటే హైడ్‌ ఆప్షన్‌ ఉంటుంది. కాంటాక్ట్‌పైన లాంగ్‌ ప్రెస్‌ చేస్తే పైన మ్యూట్‌ బటన్‌ పక్కన ఉన్న ఆర్చీవ్‌ బటన్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది. 

8. ‘మీడియా విజిబిలిటీ’ ఆప్షన్:  

వాట్సాప్‌లో వచ్చిన ఇమేజెస్‌, వీడియోలు ఫోన్‌ గ్యాలరీలో ఆటో సేవ్‌కాకుండా ఉండటానికి ‘మీడియా విజిబిలిటీ’ అనే ఫీచర్‌ అందుబాటులో ఉంది. దీన్ని టర్న్‌ ఆఫ్‌ చేసుకుంటే మీడియా ఫైల్స్‌ గ్యాలరీలో సేవ్‌ అవ్వవు. ఐఫోన్‌ యూజర్లయితే ‘సేవ్‌ టూ కెమెరా రోల్‌’ను డిసేబుల్‌ చేసుకోవాలి.

9. ‘బ్లూ టిక్‌’ ఆపవచ్చు:

మనకు ఇతరులు చేసిన మెసేజ్‌ను చదివి రెస్పాండ్‌ అయ్యే తీరిక లేకపోతే ‘బ్లూ టిక్‌’ ఆప్షన్‌ను తీసేయవచ్చు. దీనికోసం సెట్టింగ్స్>అకౌంట్స్‌>ప్రైవసీ>రీడ్‌ రిసీప్ట్స్‌ను టర్న్‌ ఆఫ్‌ చేసుకుంటే మెసేజ్‌ ఓపెన్‌ చేసినట్లు ఇతరులకు కనిపించదు.

10. డెస్క్‌టాప్‌లో వాట్సాప్.:

కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌తో ఏదైనా పనిలో పడి ఫోన్‌లో వాట్సాప్‌ చూసుకునే వీలులేకపోతే వాట్సాప్‌ వెబ్‌ ఆన్‌ చేసి ఎంచక్కా వాడుకోవచ్చు.

Previous
Next Post »
0 Komentar