5 Indian Schools on Shortlist for
First-Ever World’s Best School Prizes
అత్యుత్తమ
విద్యాలయాల్లో 5 భారతీయ పాఠశాలలు - బ్రిటిష్ సంస్థల ప్రాథమిక జాబితాలో చోటు
ప్రపంచవ్యాప్తంగా
అత్యుత్తమ పాఠశాలలకు బహుమతులిచ్చే పథకాన్ని బ్రిటిష్ సంస్థలు ప్రారంభించాయి.
సామాజిక ప్రగతికి అవిరళ కృషి జరుపుతున్న పాఠశాలలను సత్కరించడం ఈ పథకం లక్ష్యం.
అయిదు విభాగాల్లో ఉత్తమ పాఠశాలలుగా ఎంపికైన అయిదు విద్యాలయాలకు 50,000 డాలర్ల చొప్పున మొత్తం 2,50,000 డాలర్ల , నగదు బహుమతులు ఇస్తారు. ఒక్కో
విభాగంలో 10 పాఠశాలల చొప్పున ప్రాథమికంగా ఎంపిక
చేయగా,
వాటిలో 5 భారతీయ పాఠశాలలు
ఉండటం విశేషం.
వీటిలో
ముంబయికి చెందిన ఎస్వీకేఎం సీఎన్ఎం పాఠశాల, ఖోజ్ పాఠశాల; పుణెలోని పీసీఎంసీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల, దిల్లీకి చెందిన ఎస్డీఎంసీ ప్రాథమిక పాఠశాల ఉన్నాయి.
ప్రతికూలతలను అధిగమించడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ పాఠశాల విభాగంలో హావ్ డాలోని
సమారిటన్ మిషన్ పాఠశాల చోటు దక్కించుకుంది.
బ్రిటన్ కు
చెందిన డిజిటల్ మీడియా వేదిక టీ4 ఎడ్యుకేషన్, అమెరికన్ ఎక్స్ ప్రెస్, లెమాన్
ఫౌండేషన్,
యాక్సెంచర్, టెంపుల్టన్
వరల్డ్ ఛారిటీ ఫౌండేషన్, యయసాన్ హసనా సంస్థలు
ప్రపంచంలో అత్యుత్తమ పాఠశాల బహుమతుల పోటీని ప్రారంభించాయి. టీ4 ఎడ్యుకేషన్ సంస్థాపకుడు, ప్రపంచ
అత్యుత్తమ పాఠశాలల బహుమతి ప్రారంభకుడు వికాస్ పోటా భారత సంతతికి చెందినవారే.
పోటీలో విజేతలను అక్టోబరులో ప్రకటించి నగదు బహుమతులు ప్రదానం చేస్తారు.



0 Komentar