Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BSNL 3 GB Daily Data Plan for 6 Months – Details Here

 

BSNL 3 GB Daily Data Plan for 6 Months – Details Here

బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ లో 6 నెలల వ్యాలిడిటీతో, డైలీ 3జీబీ డేటా ప్లాన్ వివరాలు ఇవే

బీఎస్ఎన్ఎల్ (BSNL) ప్రీపెయిడ్ యూజర్ల కోసం అనేక ప్లాన్ల (Prepaid plans)ను అందుబాటులో ఉంచింది. వాటిలో నుంచి అత్యంత ప్రయోజనకరంగా ఉండే ప్యాక్ ను ఎంపిక చేసుకోవడానికి కొంత సమయం వెచ్చించాల్సిందే. మరి దీర్ఘకాల వ్యాలిడిటీ, ఎక్కువ మొత్తంలో డేటా కావాలనుకునేవారికి బీఎస్ఎన్ఎల్ (BSNL) మంచి ప్లాన్‌ను అందిస్తోంది. అదీ రూ. 1000 లోపే. మరి ఆ ప్రీపెయిడ్ ప్యాక్ (Prepaid plans) వివరాలేంటో తెలుసుకుందాం..


* బీఎస్ఎన్ఎల్ లో రోజూ 3జీబీ డేటా ప్యాక్ ను రూ. 997కు అందిస్తోంది. దీని కాలపరిమితి 180 రోజులు. అయితే, దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ (BSNL)లో ఇంకా 4జీ అందుబాటులో లేకపోవడం కొంత నిరుత్సాహపరిచే విషయం. అయినప్పటికీ.. బీఎస్ఎన్ఎల్ (BSNL) నెట్ వర్క్ సమస్యలేని ప్రాంతాల్లో ఈ ప్లాన్ తీసుకోవడం చాలా ప్రయోజనకరం. * 3జీబీ రోజువారీ డేటాతో పాటు రోజుకి 100 ఎస్ఎంఎస్ లు , అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా ఉన్నాయి. 180 రోజుల పాటు లోక్ ధమ్ కంటెంట్ కూడా ఉచితం. డేటా వినియోగం పూర్తయిన తర్వాత వేగం 80 కేబీపీఎస్ కు  పడిపోతుంది.

* ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ 4జీ కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఆయా ప్రదేశాల్లో ఈ ప్యాక్ యూజర్లకు ఎంతో ప్రయోజనకరం. రూ. 1000 లోపు 6 నెలల వ్యాలిడిటీతో, డైలీ 3జీబీ డేటా ఇతర ఏ టెలికాం సంస్థ అందించడం లేదు.

DOWNLOAD BSNL SELF CARE APP

Previous
Next Post »
0 Komentar

Google Tags