Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JVK Kits: Vidya Kanuka Latest Receiving and Distribution Guidelines

 

JVK Kits: Vidya Kanuka Latest Receiving and Distribution Guidelines

ఆర్.సి.నెం. SS-16021/50/2021-CMO SEC-SSA, తేది: 29.06.2022.

విషయం : ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్షా - 'జగనన్న విద్యా కానుక' 2022 - 23 - జిల్లా కేంద్రం, మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు వస్తువులు వారీగా సరఫరా - విద్యార్థులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు - స్టూడెంట్ కిట్లు రూపకల్పన - జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు, సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు - జారీచేయుట - గురించి. 

ఆదేశములు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న అందరు విద్యార్థులకు సమరశిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించారు. పాఠశాలలు తెరిచేనాటికి ప్రతి విద్యార్థికి కిట్ అందించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి ఆశయం. పాఠశాలలు తెరిచే రోజు నాటికి అన్ని వస్తువులతో కూడిన కిట్లను అందించడానికి తక్కువ వ్యవధి ఉండటం వలన అందరు అధికారులు, సిబ్బంది వెనువెంటనే దృష్టి పెట్టి, దిగువ తెలిపిన విషయాలను అమలుచేయవలసినధిగా కోరడమైనది. 

ముఖ్యంగా గమనించవలసిన విషయాలు:

* 'జగనన్న విద్యా కానుక'లో భాగంగా ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, నిఘంటువును (ఒకటవ తరగతి విద్యార్థులకు pictorial డిక్షనరీ మరియు ఆరవ తరగతి విద్యార్థులకు Oxford డిక్షనరీ) కిట్ రూపంలో అందించవలసి ఉంటుంది.

* ఈ కిట్ లో భాగంగా తరగతి వారీగా ప్రతి విద్యార్థికి ఏయే వస్తువులు ఇవ్వాలో 'అనుబంధం-1'లో పొందుపరచడమైనది. దీనిని ప్రతి ఒక్కరూ గమనించగలరు.

* 'జగనన్న విద్యా కానుక' కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా స్కూల్ కాంప్లెక్స్ / మండల పరిధిలో మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పరస్పర సహకారంతో పని చేయాలి. * * దీనికి సంబంధించి నోటు పుస్తకాలు, బ్యాగులు మరియు బెల్టులు స్కూల్ కాంప్లెక్సులకు, యూనిఫాం క్లాత్, ఒక జత బూట్లు & రెండు జతల సాక్సులు మండల రిసోర్సు కేంద్రాలకు మరియు డిక్షనరీలు జిల్లా కేంద్రాలకు అందజేస్తారు.

CLICK FOR PROCEEDINGS

================

Vidya Kanuka (JVK) APP

DOWNLOAD HERE

================

Previous
Next Post »
0 Komentar

Google Tags