Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Mountaineer Malavath Purna Climbs Mt. Denali and Creates History with Reaching All 7 Highest Peaks in the World

 

TS Mountaineer Malavath Purna Climbs Mt. Denali and Creates History with Reaching All 7 Highest Peaks in the World

డెనాలీ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలోని 7 ఎత్తైన శిఖరాలను చేరుకున్న అరుదైన ఘనతతో మరోసారి చరిత్ర సృష్టించింన మలావత్ పూర్ణ

మలావత్ పూర్ణ దేశం గర్వించేలా ప్రపంచంలోని 7 ఎత్తైన శిఖరాలను చేరుకున్న అరుదైన ఘనతతో మరోసారి చరిత్ర సృష్టించింది. ఈ నెల 5వ తేదీన 6,190 మీటర్ల ఎత్తుతో ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తైన దెనాలి శిఖరాన్ని చేరుకోవడం ద్వారా ఆమె వరల్డ్ 7 సమ్మిట్ ఛాలెంజ్‌ను పూర్తి చేసింది.


'భారతదేశంలో అతి పిన్న వయస్కురాలు'గా రికార్డు సృష్టించింది. మే 18న ఇండియా నుంచి బయలుదేరిన పూర్ణ మే 19న అలస్కాలోని ఎంకరేజ్‌కి చేరుకుంది.ఈ పర్వతారోహణలో పూర్ణతో పాటు మన దేశానికి చెందిన మరో నలుగురు సభ్యులు ఉన్నారు.

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిజామాబాద్ కు చెందిన మలావత్ పూర్ణ మరో ఘనత సాధించారు. అమెరికా దేశం అలస్కాలోని 6,190 మీటర్ల ఎత్తయిన డెనాలీ శిఖరాన్ని అధిరోహించారు. తాజా ఘనత ద్వారా ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహించిన యువతిగా రికార్డు సృష్టించారు.

పూర్ణ జూన్ 5న డెనాలీ శిఖరం పైకి చేరుకొన్నారు. ఉత్తరాదికి చెందిన తండ్రి కూతుళ్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్ బజాజ్, దియా బజాజ్, విశాఖకు చెందిన అన్మీశ్ వర్మతో కలిసి మే 28న ఆమె యాత్ర ప్రారంభించారు. ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ ఆర్ధిక సాయం, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ సంస్థ సహకారంతో యాత్ర పూర్తి చేశారు. తాజా రికార్డుపై పూర్ణ కోచ్ శేఖర్ బాబు హర్షం వ్యక్తం చేశారు.

HER BIOGRAPHY BOOK

Previous
Next Post »
0 Komentar

Google Tags