Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PALAKA – AKSHARABHYASAM

 

PALAKA – AKSHARABHYASAM

పలక - అక్షరాభ్యాసం

తెలుగు భాషను సులభంగా వేగంగా నేర్పించడానికి ఉపాధ్యాయులకు చక్కని బోధనోపకరణాలు అవసరం. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషలలో తెలుగు మొదటి వరుసలో ఉంది. పరభాషల మోజులో మన తెలుగును దూరం కాకుండా కాపాడే బాధ్యత ఉభయ తెలుగు రాష్ట్రములలోని ఉపాధ్యాయులపై ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా పలక అక్షరాభ్యాసం మనముందుకు వచ్చింది.

ఒక చార్ట్ చూపి అక్షరాలు పరిచయం చేయగానే విద్యార్థి గ్రహించి నేర్చుకోవాలి. కానీ అలా జరగడం లేదు. తరగతిలో కొందరు మాత్రమే నేర్చుకోగలుగుతున్నారు. దీనికి కారణం అక్షరాలను లోతుగా అర్ధం చేసుకోలేకపోవడం. అక్షరాలను అనేక కోణాలలో గమనించి నేర్చుకోడానికి అక్షరాభ్యాసం చార్టులు అందుబాటులోకి తెచ్చారు. మన పలన బృందం.

తెలుగు భాషలో కొన్ని అక్షరాలను ప్రస్తుత సమాజంలో ఉపయోగించకపోవడం వలన కొన్ని అక్షరాలు మరుగున పడ్డాయి. వాటిని వదిలివేయడం సరికాదు. అలాంటి అక్షరాలను విద్యార్థులకు ద్వితీయ ప్రాధాన్యతగా నేర్పించాలని కోరుచున్నాము. తొలుత అవసరమయిన అక్షరాలు నేర్పడం జరుగుతుంది. వరుసక్రమంలో ఉపకరణాల గురించి తెలుసుకుందాం.

అచ్చు అక్షరాలను చిత్రాలతో చూపడం జరిగినది. ఉపాధ్యాయులు సంబంధం గల ఇతర చిత్రాలను కూడా పరిచయం చేయవచ్చు.

హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు వివరంగా శబ్ద భేదం తెలిసేలా పలుకుతూ నేర్పాలి.

అక్షరాలు వరుసలో క్రమంలో లేకపోయినా విద్యార్ధులు గుర్తించాలి. ఒకవేళ గుర్తించలేకపోతే తిరిగి చిత్రాలతో కూడిన అక్షరాలు మరొకసారి చూపించాలి. (2 చార్టులు)

హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు వడిగా గుర్తించడం మరియు పలకడం వివరించాలి. ఒక కార్డులో ఒకే అచ్చు రెండుసార్లు వేర్వేరు చోట్ల ఉన్నవి. వాటిని గుర్తించాలి. కొన్ని అచ్చులు ఇవ్వబడ్డాయి. లేని అక్షరాలను గుర్తించాలి.

చార్టులో ఉన్న అచ్చులు చూసి లేని అచ్చులను రాయాలి. (కనిపంచే అచ్చులుకూడా వరుసలో ఉండవు.)

అచ్చులను వెనుకనుండి మొదట అక్షరం వరకు చూపడం జరిగినది. అచ్చులకు 0 చేర్చి ఎలా చదవాలో, రాయాలో, పలకాలో గుర్తింపచేయాలి.

హల్లులు అవి మొదలయ్యే పదాలతో చూపబడినవి. మహాప్రాణాక్షరాలు, అనునాసికాలు తరువాత నేర్పడం జరుగుతుంది. కనుక ఈ కార్డులో పరిచయం చేయలేదు.

పరుషములు, సరళములు, స్థిరములు విడిగా నేర్పుటకు అందించబడినవి. రూపంలో పోలికగల అక్షరాలను వివరించడానికి ఈ చార్టు ఉపయోగపడుతుంది.

హల్లులకు 0 చేర్చడం ద్వారా అక్షరం పలకడం, చదవడం, గుర్తించడం తెలపాలి.

0 ఉభయాక్షరం అని అచ్చులు, హల్లులు పక్కన చేరి ఒకరూపం ఏర్పడుతుందని తెలపవలెను. తలకట్టు లేని హల్లులు, తలకట్టుగల హల్లులు అక్షరం గుర్తించడంలో ఒక చిట్కాలా చూపబడినవి.

56 అక్షరాలు ఉన్న ప్రామాణిక వర్ణమాలను పరిచయం చేయడం జరిగినది.

తలకట్టు చేర్చి హల్లులను గుణింతాక్షరంగా చదవడం కొరకు ఇవ్వబడినవి. అచ్చు శబ్దమునకు రూపచిహ్నంగా వచ్చు తలకట్టును చేర్చి సంపూర్ణ అక్షరం ఏర్పడు విధమును చూపడం జరిగినది. దీర్ఘంతో ఉన్న గుణింతాక్షరాలను పరిచయం చేయడం జరిగినది.

గుడి తో ఉన్న గుణింతాక్షరాలను పరిచయం చేయడం జరిగినది.

గుడి దీర్ఘంతో ఏర్పడు గుణింతాక్షరాలను పరిచయం చేయబడినవి.

కొమ్ముతో ఏర్పడు గుణింతాక్షరాలను పరిచయం చేయడం జరిగినది.

కొమ్ముదీర్ఘంతో ఏర్పడు గుణింతాక్షరాలను పరిచయం చేయడం జరిగినది.

ఋత్వంతో ఏర్పడు గుణింతాక్షరాలను పరిచయం చేయడం జరిగినది.

ఋత్వం దీర్ఘంతో ఉండే గుణింతాక్షరాలను పరిచయం చేయడం జరిగినది.

ఎత్వంతో ఉండే గుణింతాక్షరాలను పరిచయం చేయడం జరిగినది.

ఏత్వంతో ఏర్పడు గుణింతాక్షరాలను పరిచయం చేయడం జరిగినది.

ఐత్వంతో ఏర్పడు గుణింతాక్షరాలను పరిచయం చేయడం జరిగినది.

ఒత్వంతో ఏర్పడు గుణింతాక్షరాలను పరిచయం చేయడం జరిగినది.

ఓత్వంతో ఏర్పడు గుణింతాక్షరాలను పరిచయం చేయడం జరిగినది.

ఔత్వంతో ఏర్పడు గుణింతాక్షరాలను పరిచయం చేయడం జరిగినది.

ఇంతవరకు గుణింత చిహ్నంతో అన్ని అక్షరాలను గుణింతాక్షరాలుగా ఎలా మార్పు చెందుతాయో పరిచయం చేయవచ్చునో వివరించడం జరిగినది. ఈ చార్టులో ప్రతిహల్లు అక్షరంతో ఉన్న గుణింతాలు అందించాము. (2 చార్టులు ఉన్నవి.) రూపసారూప్యత గల అక్షరాలతో ఉన్న గుణింతాలు, ప్రత్యేక రూపంతో ఏర్పడు అక్షరంలు గల గుణింతాలు ఈ చార్టులో అందించబడినవి. మహాప్రాణాక్షరాలను ఉదాహరణలు, చిత్రాలతో చూపించాము. మహాప్రాణాక్షరాలతో గుణింతాలు పరిచయం చేశాము. ద్విత్వాక్షరం ఏర్పడు విధమును, ద్విత్వాక్షర గుణింతాలను చూపించడం జరిగినది. సయుక్తాక్షరములు ఎలా ఏర్పడతాయో ఉదాహరణ చూపడం జరిగినది.

అరుదుగా ఉపయోగించు అక్షరములను పరిచయం చేసి విద్యార్థిని గందరగోళంలోకి తీసుకువెళ్ళడం సరికాదని అరుదుగా ఉపయోగించు, వాడుకలో లేని అక్షరాలను తొలుత పరిచయం చేయవద్దని తెలపడం జరిగినది.

ఉపాధ్యాయులు వారి సౌలభ్యమును బట్టి పదపద్దతిలో బోధించదలచినపుడు నేరుగా హల్లు అక్షరముల చార్టుతో మొదలు పెట్టవచ్చు. ఇవి పుస్తకం, ఫ్లాష్ కార్డు, చార్టు ఏ రూపంలో ఉంటే ఉపయోగమో కామెంట్ లో తెలుపండి. ప్రస్తుతం డిజిటల్ రూపంలో ఉన్న ఈ ప్రయత్నం త్వరలో మనముందు ముద్రణ రూపంలో ఉంటుంది.

వివరములకు బి. సోమసుందరరావు. 9705556925 సంప్రదించగలరు.

డౌన్లోడ్ పలక అక్షరాభ్యాసం ఫైల్ 

Previous
Next Post »
0 Komentar

Google Tags