Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Delhi Model Virtual School: Delhi Govt Launches India's First Virtual School – All the Details Here

 

Delhi Model Virtual School: Delhi Govt Launches India's First Virtual School – All the Details Here

దిల్లీ మోడల్‌ వర్చువల్ స్కూల్‌: దేశంలోనే మొట్ట మొదటి వర్చువల్ స్కూల్ ని ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం - పూర్తి వివరాలు ఇవే  

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ దేశంలోనే తొలి వర్చువల్‌ పాఠశాలను ప్రారంభించారు. దేశంలో విద్యార్థలందరూ ఈ బడిలో చేరేందుకు అర్హులేనని తెలిపారు. దిల్లీ మోడల్‌ వర్చువల్ స్కూల్‌-డీఎంవీఎస్లో బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియను చేపట్టారు. 9 నుంచి 12వ తరగతి వరకు వర్చువల్ పాఠశాలలో బోధిస్తారు. 13 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులు వర్చువల్‌ బడిలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని కేజ్రీవాల్ చెప్పారు. నీట్‌, సీయూఈటీ, జేఈఈ వంటి పరీక్షలకు వర్చువల్‌ పాఠశాలలో నిపుణులతో శిక్షణ ఇస్తామన్నారు.

దిల్లీ మోడల్‌ వర్చువల్ స్కూల్‌ను దేశ విద్యారంగంలో మైలురాయిగా సీఎం కేజ్రీవాల్‌ అభివర్ణించారు. దూరం వంటి అనేక కారణాలతో చాలా మంది పిల్లలు బడికి వెళ్లలేకపోతున్నారని, బాలికలను దూరం పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడంలేదని ఆయన చెప్పారు. అలాంటి వారందరికీ విద్యను అందించేందుకు.. దిల్లీ వర్చువల్‌ పాఠశాలను అందుబాటులోకి తెచ్చినట్లు కేజ్రీవాల్‌ వివరించారు. తరగతులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని, ఉపాధ్యాయులు బోధించే వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తామని చెప్పారు.

వర్చువల్ స్కూల్ ఎలా పనిచేస్తుందంటే..

Ø 1. ఈ వర్చువల్ స్కూల్‌ దిల్లీ బోర్డ్ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఉంటుంది. మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్ అన్నీ డీబీఎస్ఈ ఇస్తుంది.

2. డీబీఎస్ఈ ఇచ్చే మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్ ఇతర బోర్డులు ఇచ్చే ధ్రువపత్రాలతో సమానం. వీటి ఆధారంగా విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరవచ్చు.

3. వర్చువల్ స్కూల్లో చేరే విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయరు.

4. తొలి బ్యాచ్లో ఎంత మంది విద్యార్థులను తీసుకోవాలో ఇంకా ఏమీ అనుకోలేదు.

5. రిజిస్ట్రేషన్ల ఆధారంగా ఈ విషయంలో ఒక నిర్ణయానికి రానున్నారు.

6. స్కూల్నెట్, గూగుల్ కలిసి అభివృద్ధి చేసిన స్కూలింగ్ ప్లాట్ఫాం ద్వారా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారు.

7. విద్యార్థుల అటెండన్స్ తీసుకునేందుకు ఈ ఆన్లైన్ ప్లాట్ఫాంలోనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది.

8. పరీక్షలు వర్చువల్ మోడ్లో జరిగినా కాపీకి ఆస్కారం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కో టాపిక్పై విద్యార్థుల అవగాహనను తెలుసుకునేలా పరీక్షలు ఉంటాయి. వీటిలో కాపీ కొట్టేందుకు అవకాశాలు చాలా తక్కువ. అయితే.. రెండు టెర్మ్-ఎండ్ పరీక్షల కోసం విద్యార్థులు తప్పనిసరిగా దిల్లీకి రావాల్సి ఉంటుంది. దిల్లీలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో కంప్యూటర్ ద్వారా విద్యార్థులు ఈ పరీక్షలు రాయాలి.

9. దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్నే వర్చువల్ స్కూల్ కోసం ఎంపిక చేశారు. వీరికి ఆన్లైన్ విధానంలో బోధనపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. భవిష్యత్ అవసరాలను బట్టి మరింత మంది ఉపాధ్యాయుల్ని నియమించుకునే విషయాన్ని పరిశీలించనున్నారు.

10. వర్చువల్ స్కూల్లో ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో పాఠాలు బోధిస్తారు.

ఈ వర్చువల్ స్కూల్ ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా నడుస్తుంది. 9-12వ తరగతి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కేవలం ఢిల్లీ విద్యార్థులు మాత్రమే కాదు.. దేశంలో ఎక్కడి వారైనా ఈ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకోవచ్చు. పలు కారణాలతో పాఠశాలలకు వెళ్లలేని ఈ వర్చువల్ స్కూల్‌లో చేరి.. తాము ఉన్న ప్రాంతాల్లోనే తరగతులకు హాజరుకావచ్చు. ఇక్కడ జేఈఈ (JEE), నీట్ (NEET), సీయూఈటీ (CUET) పరీక్షలకు కూడా నిపుణులతో కోచింగ్ ఇప్పిస్తారు. దేశవిద్యారంగంలోనే ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్.. ఒక మైలురాయి అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా సమయంలో నిర్వహించిన వర్చువల్ తరగతుల స్ఫూర్తితోనే ఈ పాఠశాల ప్రారంభించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు

ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్లో విద్యార్థులు లైవ్ క్లాస్‌లకు హాజరుకావచ్చు. పలు కారణాలతో లైవ్‌ క్లాస్‌లకు అటెండ్ కాలేకపోయినా ఇబ్బందేం ఉండదు. క్లాస్ సెషన్లను రికార్డ్ చేసి.. ఆ వివరాలను విద్యార్థులకు పంపిస్తారు. అప్పుడు విద్యార్థులు తమకు వీలైన సమయంలోనే పాఠాలు వినవచ్చు. ఈ సదుపాయాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు ఒక్కో విద్యార్థికి ఒక్కో ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. అంతేకాదు డిజిటల్ లైబ్రరీ సేవలు కూడా అందుబాటులో ఉంచారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకునే విద్యార్థులకు... స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్‌కు కూడా అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 04-09-2022

ONLINE APPLICATION

ADMISSION GUIDELINES

ADMISSION DETAILS PAGE

ABOUT DMVS

FAQs

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags