APPSC Recruitment 2022: Group-1
Posts – Details Here
ఏపీపీఎస్సీ: గ్రూప్-1 పోస్టులు – అన్నీ వివరాలు ఇవే
=======================
UPDATE
28-01-2023
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల – మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి ప్రకటించింది.
ఈ నెల 8వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష రాసిన
వారిలో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 6,455 మందిని ప్రధాన పరీక్ష రాసేందుకు ఏపీ పీఎస్సీ ఎంపిక చేసింది.
MAINS: ప్రధాన పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. వాస్తవానికి గ్రూప్-1 కింద అన్ని రకాలు భర్తీ చేయాల్సిన
పోస్టులు 111 ఉన్నాయి. దీని ప్రకారం 5,550 మందిని ప్రధాన
పరీక్షలకు ఎంపిక చేయాలి. కానీ... ఒకరి కంటే ఎక్కువ మందికి ఒకే మార్కులు రావడం, సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలోనూ సంఖ్య పెరిగిందని ఏపీపీఎస్సీ
వర్గాలు తెలిపాయి.
=======================
UPDATE 10-01-2023
ప్రారంభ 'కీ' విడుదల
=======================
UPDATE
08-01-2023
SCREENING
TEST (PRELIMS) – 08/01/2023
=======================
UPDATE 31-12-2022
పరీక్ష తేదీ: 08/01/2023
Group I Specimen copies of OMR Answer
Sheet and Question Paper Booklets 👇
=======================
UPDATE
11-11-2022
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ముందుగా ప్రకటించిన 18-12-2022 తేదీ నుండి 08-01-2023
కి వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది.
WEB
NOTE ON EXAM DATE POSTPONEMENT
=======================
ఏపీలో 92 గ్రూప్-1 సర్వీసు
ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో గ్రూప్-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్
విడుదల చేసింది. గ్రూప్-1(జనరల్/ లిమిటెడ్ రిక్రూట్ మెంట్)
ప్రకటన నెం. 28/2022 ద్వారా 92 పోస్టులు భర్తీ కానున్నాయి.
అభ్యర్థులు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఆన్
లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది. పోస్టు పేరు, శాఖ వివరాలు:
1. డిప్యూటీ కలెక్టర్ (ఏపీ సివిల్
సర్వీస్- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్): 10 పోస్టులు
2. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్
ట్యా క్స్ (ఏపీ స్టేట్ టాక్స్ సర్వీస్): 12 పోస్టులు
3. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్
పోలీస్ (సివిల్) క్యాట్-2 (ఏపీ పోలీస్ సర్వీస్): 13 పోస్టులు
4. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్
(మెన్) (ఏపీ జైల్ సర్వీస్): 02 పోస్టులు
5. డివిజనల్/ డిస్ట్రిక్ట్ ఫైర్
ఆఫీసర్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీస్): 02 పోస్టులు
6. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏపీ ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్):
08 పోస్టులు
7. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ (ఏపీ
ట్రాన్స్పర్ట్ సర్వీస్): 02 పోస్టులు
8. మండల్ పరిషత్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (ఏపీ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్ మెంట్): 07 పోస్టులు
9. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ (ఏపీ రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ సర్వీస్): 03 పోస్టులు
10. డిస్ట్రిక్ట్ టైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్): 01 పోస్టు
11. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్): 02 పోస్టులు
12. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 (మున్సిపల్
అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్): 06 పోస్టులు
13. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ లే సెక్రటరీ & ట్రెజరర్ గ్రేడ్-2(ఏపీ మెడికల్ అండ్ హెల్త్
(అడ్మినిస్ట్రేషన్) సర్వీస్): 18 పోస్టులు
14. డిప్యూటీ రిజిస్టార్ (ఏపీ కోఆపరేటివ్ సర్వీస్): 01 పోస్టు
15. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్): 05 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 92
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
డివిజనల్ / డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు బీఈ (ఫైర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01/07/2022 నాటికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సివిల్) ఖాళీలకు 21-30 ఏళ్లు, డిప్యూటీ సూపరింటెండెంట్
ఆఫ్ జైల్ (మెన్) ఖాళీలకు 18-30 ఏళ్లు, డివిజనల్ / డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఖాళీలకు 21-28 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18 - 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (స్క్రీనింగ్), మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ ), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు (జిల్లా కేంద్రాలు):
శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం, పల్నాడు, పార్వతీపురం మన్యం, బాపట్ల, అల్లూరి సీతా
రామరాజు, ప్రకాశం, విశాఖపట్నం, ఎస్.పి.ఎస్.ఆర్.నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరు, కాకినాడ, తిరుపతి, డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, అన్నమయ్య, తూర్పుగోదావరి, వై.యస్.ఆర్.కడప, పశ్చిమగోదావరి, శ్రీ సత్యసాయి, ఏలూరు, అనంతపురం, కృష్ణా, నంద్యాల, ఎన్టీఆర్
జిల్లా, కర్నూలు.
ప్రధాన పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
దరఖాస్తు రుసుము: రూ.370.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్య మైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 13/10/2022.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01/11/2022.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02/11/2022. 05/11/2022
ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్): 18/12/2022. 08/01/2023
మెయిన్స్- రాత పరీక్ష(డిస్క్రిప్టివ్): మార్చి ద్వితీయార్ధం, 2023.
WEB
NOTE ON DUE DATE EXTENSION
=======================
APPSC Recruitments 2022: వివిధ కేటగిరీల్లోని 378 పోస్టుల భర్తీకి 11 నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే
=======================
0 Komentar