Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Nobel Prize 2022: French Author Annie Ernaux wins Nobel Prize in Literature

 

The Nobel Prize 2022: French Author Annie Ernaux wins Nobel Prize in Literature

ఈ ఏడాది సాహిత్యం లో ఫ్రెంచ్ రచయిత్రి అనీ ఎర్నాక్స్ కు నోబెల్‌ బహుమతి

ఈ ఏడాది సాహిత్యం (Literature)లో ఫ్రాన్స్ కు చెందిన రచయిత్రి అనీ ఎర్నాక్స్(Annie Ernaux)కు ప్రపంచ అత్యున్నత నోబెల్ పురస్కారం (Nobel Prize) లభించింది. జ్ఞాపకశక్తి మూలాలపై ఆమె రచించిన 'ఫర్ ద కరేజ్ అండ్ క్లినికల్లీ ఏక్యుటీ' రచనకు గాను నోబెల్ పురస్కారం వరించింది. సాహిత్య రంగంలో అనీ ఎర్నాక్స్ చేసిన విశేష . సేవలకు గాను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. లింగం, భాష, వర్గం అంశాలపై స్వీయ అనుభవాలతో విభిన్న కోణాల నుంచి విశ్లేషిస్తూ చేసే రచనలతో ఆమె ప్రసిద్ధిగాంచారు.

1940లో నార్మాండీలోని యెవెటోట్ అనే చిన్న పట్టణంలో ఎర్నాక్స్ పుట్టి పెరిగారు. అక్కడే తల్లిదండ్రులతో కలిసి ఓ దుకాణం, కేఫ్ ను నడుపుతోన్న ఎర్నాక్స్ రచయిత్రి వైపు సాగించిన ప్రయాణం ఎంత సుదీర్ఘమైనది, కష్టంతో కూడుకున్నది. ఆమె 30కి పైగా సాహిత్య రచనలు చేశారు. గత కొన్నేళ్లుగా నోబెల్ పురస్కారం ఎర్నాక కు వస్తుందంటూ ఊహాగానాలు చెలరేగేవి. అయితే, అవి ఇప్పటికి నిజమయ్యాయి.

 1901 నుంచి ఇప్పటివరకు 119మందికి సాహిత్య నోబెల్ పురస్కారాలు ప్రదానం చేయగా.. ఈ జాబితాలో ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన 17వ మహిళగా ఎర్నాక్స్ నిలవడం విశేషం.

ఇప్పటివరకు వైద్యం, భౌతిక, రసాయనశాస్త్రాలతో పాటు సాహిత్య నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించారు. ఆర్థికరంగం, శాంతి బహుమతులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించాల్సి ఉంది. నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags