Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Massive Earthquake in Turkey & Syria – Over 4,500 Dead

 

Massive Earthquake in Turkey & Syria – Over 4,500 Dead

టర్కీ, సిరియా లో భారీ భూకంపం – 4,500 దాటిన మరణాలు, 17,800 మందికి పైగా గాయాలు - భారీ భూకంపాన్నీ ముందే ఊహించిన శాస్త్రవేత్త

=======================

టర్కీ, సిరియా రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 4,500ల మందికి పైగా మృత్యువాత పడగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మరోవైపు, టర్కీ లో దశలవారీగా భూ ప్రకంపనలతో జనం ప్రాణభయంతో భీతిల్లిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

టర్కీ (Turkey) కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్ (USA) జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆగ్నేయ టర్కీ లోని గాజియాన్టెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. టర్కీ లోని దియర్బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రమాద తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 


=======================

మొత్తం: మరణాలు 4,500 మందికి పైగా మరణించారు, 19,000 మందికి పైగా గాయపడ్డారు

టర్కీలో 3,000 మందికి పైగా మరణించారు మరియు 15,000 మంది గాయపడ్డారు

సిరియాలో 1,500 మందికి పైగా మరణించారు మరియు 4,000 మంది గాయపడ్డారు

=======================

భారీగా మరణాలు..

తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విలయం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తుర్కియేలో మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించగా.. ఇప్పటివరకు 4,500 మందికి పైగా మరణించినట్లు అక్కడి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, 19,000 మందికి పైగా గాయపడగా.. భూకంప తీవ్రతకు టర్కీ లో దాదాపు 3వేల భవనాలు ధ్వంసమయ్యాయి.

ఇకపోతే, సిరియా (Syria) లోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాలు, రెబల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కలిపి 14000 మందికి పైగా మరణించినట్టు సమాచారం. వందలాది మంది గాయపడ్డారు. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గతంలో టర్కీలో భూకంప విషాదాలు ఇలా..

ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప జోన్లలో టర్కీ ఒకటి. 1999లో టర్కీలో సంభవించిన భూకంప తీవ్రత (7.4) పెను విషాదాన్ని సృష్టించింది. ఆ సమయంలో 17వేల మందికి పైగా మృతిచెందగా.. ఒక్క

ఇస్తాంబుల్లోనే వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 1939లో తూర్పు ఎర్జిన్కన్ ప్రావిన్స్ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు కాగా.. ఆ సమయంలో 33వేల మంది మృతిచెందారు.

సాయానికి ముందుకొస్తున్న ప్రపంచ దేశాలు..

తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి వైపరీత్యానికి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్ సహా నెదర్లాండ్స్, గ్రీస్, సెర్బియా, స్వీడన్, ఫ్రాన్స్ తదితర దేశాలు సహాయక సామగ్రి, ఔషధాలు వంటివి పంపిస్తామని హామీ ఇచ్చాయి.

=======================

భారీ భూకంపాన్నీ ముందే ఊహించిన శాస్త్రవేత్త

భారీ భూకంపం: టర్కీ, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించి ఇప్పటికే 4,500 మందికిపైగా చనిపోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఉపద్రవాన్ని ఓ వ్యక్తి మూడు రోజుల ముందే ఊహించారు. టర్కీ, సిరియాలో త్వరలో భారీ భూకంపం రాబోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. కానీ ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన అంచనాలు ఎప్పుడూ నిజమైన దాఖలాలు లేవని కొట్టిపారేశారు.

కానీ మూడు రోజుల తర్వాత ఆయన చెప్పిందే నిజమైంది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతో భూకంపం వచ్చి టర్కీ, సిరియా అతలాకుతలం అయ్యాయి. వేల భవనాలు నేలమట్టయ్యాయి. బిల్డింగులు పేక మేడల్లా కూలిపోయాయి.

భూకంపాన్ని ముందే ఊహించిన ఈ వ్యక్తి పేరు ఫ్రాంక్ హూగర్బీట్స్. భూకంప కార్యకలాపాలను అధ్యయనం చేసే 'సోలార్ సిస్టం జియోమెట్రిక్ సర్వే'(SSGEOS) పరిశోధకులు. 'అతి త్వరలో లేదా తర్వాత సౌత్ సెంట్రల్ టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతో భారీ భూకంపం వస్తుంది.' అని ఫ్రాంక్ ఫిబ్రవరి 3న ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీటు కొందరు కొట్టపారేశారు. ఫ్రాంక్ నకిలీ శాస్త్రవేత్త అని విమర్శలు కూడా గుప్పించారు. గతంలో ఆయన అంచనాలు ఏనాడూ నిజం కాలేదని చులకన చేసి మాట్లాడారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన అంచనాలే అక్షరసత్యం కావడంతో అందరూ షాక్ అయ్యారు.

భూకంపం అనంతరం ఫ్రాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పిందే నిజమైందని వందల మంది ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందని ట్వీట్ చేశారు. వందేళ్లకు ఓసారి ఇలాంటి భారీ భూకంపం వస్తుందని, క్రీ. శ 115, క్రీ. శ 526 సంవత్సారాల్లో కూడా ఇలాంటి పెను విపత్తులే సంభవించాయని వివరించారు.

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags