Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP TWREIS EMRS Admissions 2023-24: Admissions for 6th Class & Backlog Admissions for 7th, 8th, 9th Classes

 

AP TWREIS EMRS Admissions 2023-24: Admissions for 6th Class & Backlog Admissions for 7th, 8th, 9th Classes

ఆంధ్ర ప్రదేశ్ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు మరియు 7,8,9 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష పూర్తి వివరాలు ఇవే

======================

UPDATE 26-04-2023

ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 30/04/2023

DOWNLOAD HALL TICKETS

WEBSITE 

======================

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని 28 ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాగ్ లాగ్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, విద్య అందిస్తారు. బోధనా మాధ్యమం ఆంగ్లంలో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఏప్రిల్ 15లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

సీట్ల వివరాలు: ప్రతి ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 1,680(840 బాలురు, 840 బాలికలు) సీట్లు ఉన్నాయి. ఏడో తరగతిలో 126(48 బాలికలు, బాలురు 78), ఎనిమిదో తరగతిలో 81(28 బాలికలు, బాలురు 53), తొమ్మిదో తరగతిలో 53 (29 బాలికలు, బాలురు 24) సీట్లు ఉన్నాయి.

అర్హతలు: ఆరో తరతగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు తప్పనిసరిగా 2022-23 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి వరుసగా 6, 7, 8 తరగతుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్ష మించకూడదు.

వయోపరిమితి: మార్చి 31, 2023 నాటికి ఆరో తరగతికి 10-13 ఏళ్లు.. ఏడో తరగతికి 11-14 ఏళ్లు, ఎనిమిదో తరగతికి 12-15 ఏళ్లు, తొమ్మిదో తరగతికి 13-16 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఆరో తరగతికి 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ(50 ప్రశ్నలు), అరిథెమెటిక్(25 ప్రశ్నలు), లాంగ్వేజ్ (తెలుగు - 25 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. 7, 8, 9 తరగతులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ (10 ప్రశ్నలు), రీజినల్ లాంగ్వేజ్ (తెలుగు - 10 ప్రశ్నలు), మ్యాథ్స్(30 ప్రశ్నలు), సైన్స్ (30 ప్రశ్నలు), సోషల్ సైన్స్ (20 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27-02-2023

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 15-04-2023

పరీక్ష తేదీ: 30-04-2023   

మెరిట్ జాబితా తయారీ: 10-05-2023.

ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి: 17-05-2023.

కాల్ లెటర్ల పంపిణీ: 17-05-2023.

======================

APPLICATION

NOTIFICATION

CIRCULAR

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags