Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Realme GT3: Realme Announces GT3 Featuring 240W Fast Charger – Full Charging in 10 Mins

 

Realme GT3:  Realme Announces GT3 Featuring 240W Fast Charger – Full Charging in 10 Mins

రియల్ మి జీటీ 3: రియల్ మి కొత్త ఫోన్ - 240W ఫాస్ట్ ఛార్జర్ - 10 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్

======================

అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే స్మార్ట్ ఫోన్ రియల్ మి తీసుకొచ్చింది. జీటీ సిరీస్ లో  రియల్ మి జీటీ 3ని ( Realme GT 3) మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో లాంచ్ చేసింది. 240w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న తొలి ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. దీనివల్ల 4,600 ఎంఏ హెచ్ బ్యాటరీని కేవలం 10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్ల వివరాలు ఇవే.

రియల్మీ జీటీ 3 ఐదు ర్యామ్, స్టోరేజీ వేరియంట్లలో వస్తోంది. 8జీబీ+128జీబీ, 12 జీబీ+256 జీబీ, 16జీబీ+256జీబీ, 16జీబీ + 512 జీబీ, 16జీబీ +1టీబీ వేరియంట్లో వస్తోంది. దీని ధర ఎంత అనేది వెల్లడి కాలేదు. బేస్ వేరియంట్ ధర భారత మార్కెట్లో రూ.53,500 నుంచి ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. అమ్మకాలు సైతం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేదీ కంపెనీ వెల్లడించలేదు. గతేడాది ఏప్రిల్లో రియల్ మీ జీటీ2 స్మార్ట్ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది.

రియల్మీ జీటీ3 స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ 13తో రియలీ యూఐ 4.0తో వస్తోంది. 6.74 అంగుళాల 1.5కె అమోలెడ్, 144Hz రీఫ్రెషర్ రేటు కలిగిన డిస్ప్లే అమర్చారు. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 8+ జనరేషన్ ప్రాసెసర్ వినియోగించారు. వెనుక వైపు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మైక్రో సెన్సర్ అమర్చారు. ముందు వైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను అమర్చారు.

రెండు ప్రత్యేకతలు:

ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్.. రెండోది RGB LED ప్యానెల్. ఇందులో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ 240 సూపర్వూక్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా తొలి 50 శాతం బ్యాటరీని కేవలం నాలుగు నిమిషాల్లో, పుల్ బ్యాటరీని 9.3 నిమిషాల్లోనే ఛార్జ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఇక వెనుక వైపు RGB LED ప్యానెల్ 25 రంగులు వెలువరిస్తుంది. కాల్స్, నోటిఫికేషన్ వచ్చినప్పుడు LED అలర్ట్ వస్తుంది. యూజర్ తనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags