Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APMS: Intermediate (First Year) Admissions 2023-24 – All the Details Here

 

APMS: Intermediate (First Year) Admissions 2023-24 – All the Details Here

ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలలో 2023-24 విద్యాసంవత్సరములో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలు – పూర్తి వివరాలు ఇవే

=======================

ఆంధప్రదేశ్ లోని 162 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2023-2024 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విర్థుల ప్రవేశము కొరకై ఆన్ లైన్ ద్వారా MPC/BIPC/MEC/CEC గ్రూప్ లలో ఉచిత విద్య పొందగోరు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలలో బోధనా మాధ్యమము ఆంగ్లములో ఉండును. ఈ పాఠశాలలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.

ప్రవేశ అర్హతలు:

1. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10 వ తరగతి లో ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసికోవాలి. దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు APMS వెబ్సైటు చూడగలరు.  

2. దరఖాస్తు చేయు విధానము: అభ్యర్ధులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ. 22.05.2023 నుండి 07.06.2023 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించ బడును. ఆ జనరల్ నెంబరు ఆధారంగా వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకొనవలయును.

3. దరఖాస్తు చేయడానికి రుసుము: OC మరియు BC లకు రూ 200 /- (అక్షరములా రెండు వంద రూపాయలు మాత్రమే) SC మరియు ST లకు రూ 150/- (అక్షరములా నూట యాభై రూపాయలు మాత్రమే).

4. ప్రవేశములు 10వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని /మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 22/05/2023  

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 07/06/2023

=======================

NOTIFICATION

PAYMENT

APPLY HERE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags